STOCKS

News


ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌ లాభం 13శాతం డౌన్‌

Wednesday 7th November 2018
Markets_main1541577168.png-21770

-రూ.3,590 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.195 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.225 కోట్ల నికర లాభం వచ్చిందని, 13 శాతం క్షీణత నమోదైందని ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,699 కోట్ల నుంచి రూ.3,590 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఆర్థిక సేవల వ్యాపారాల హోల్డింగ్‌ కంపెనీగా ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ వ్యవహరిస్తోంది. ఈ కంపెనీ జీవిత బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, కార్పొరేట్‌ లెండింగ్‌, ప్రాజెక్ట్‌ ఫైనాన్స్, సాధారణ బీమా, బ్రోకింగ్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీ బ్రోకింగ్‌, ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌, తదితర సేవలందిస్తోంది.

 



You may be interested

ఓల్టాస్‌ లాభం రూ.107 కోట్లు

Wednesday 7th November 2018

- 12 శాతం వృద్ధి - రూమ్‌ ఏసీల్లో 2 శాతం పెరిగిన మార్కెట్‌ వాటా న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్‌ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.95 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.107 కోట్లకు పెరిగిందని ఓల్టాస్‌ తెలియజేసింది. కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆదాయం రూ.1,032

రూపీ @ 73... భవిష్యత్‌పై భిన్నాభిప్రాయాలు

Wednesday 7th November 2018

ముంబై: రూపాయి తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సోమవారం ఒకేరోజు 67 పైసలు పతనమై 73.12కు చేరిన రూపాయి మంగళవారం తిరిగి కోలుకుంది. 12 పైసల లాభంతో 73 వద్ద ముగిసింది. డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకులు, క్రూడ్‌ ధరలు వంటి అంశాలు ఏరోజుకారోజు రూపాయిపై ప్రభావాన్ని చూపుతున్నాయి.  అక్టోబర్‌ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.  అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో అయినా... కోలుకుంటూ వస్తోంది. గత

Most from this category