News


ఈ ఏడాది సాయం 4.5 బిలియన్‌ డాలర్లు

Saturday 12th January 2019
Markets_main1547271298.png-23543

- దీన్లో 3.5 బిలియన్‌ డాలర్లు ప్రభుత్వానికి
- మరో బిలియన్‌ డాలర్లు ప్రయివేటు రంగానికి
 భారత్‌పై ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రకటన
- రైతు రుణ మాఫీ సరైన పరిష్కారం కాదని అభిప్రాయం

న్యూఢిల్లీ: భారత్‌కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్‌ డాలర్లకు (రూ.31,500 కోట్లు) పెంచనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. పెట్టుబడుల వృద్ధికి తోడు, జీఎస్టీ స్థిరపడడంతో ఆదాయాలు పెరుగుతాయన్న అంచనాల మేరకు ఈ గణాంకాలను ప్రకటించింది. ‘‘భారత్‌కు 2019లో నిధుల సాయాన్ని 4.5 బిలియన్‌ డాలర్లకు పెంచనున్నాం. ఇందులో 3.5 బిలియన్‌ డాలర్లు భారత ప్రభుత్వానికి, మరో బిలియన్‌ డాలర్లు ప్రైవేటు రంగానికి ఇవ్వనున్నాం’’ అని ఏడీబీ ఇండియా డైరెక్టర్‌ కెనిచి యోకోయమ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. 2018లో భారత్‌కు 3.03 బిలియన్‌ డాలర్ల సౌర్వభౌమ రుణాలు ఇచ్చేందుకు కట్టుబడినట్టు చెప్పారు. ఓ ఏడాదిలో ఇదే గరిష్టమన్నారు. దీనికి అదనంగా ప్రైవేటు రంగానికి 557 మిలియన్‌ డాలర్ల రుణాలిచ్చినట్టు తెలిపారు. ప్రాజెక్టుల సంసిద్ధతపై నిధుల సాయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
వృద్ధి పుంజుకుంటుంది...
కేంద్ర ప్రభుత్వ గణాంకాల విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేయగా, ఏడీబీ అంచనాలు 7.3 శాతంగా ఉన్నాయి. 2019-20లో వృద్ధి పుంజుకుంటుందని ఏడీబీ సీనియర్‌ ఎకనమిక్స్‌ అధికారి అభిజిత్‌సేన్‌ గుప్తా పేర్కొన్నారు. జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్‌ కారణంగా ఏర్పడిన సమస్యలు తొలగిపోయాయని, చమురు ధరల తగ్గుదల గృహ వినియోగాన్ని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ద్రవ్యపరిమితులు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు వృద్ధికి సవాళ్లుగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కరెంటు ఖాతా లోటు 2.5 శాతంగా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది.
ఆర్థిక సూత్రాలకు విరుద్ధం
వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఆర్థిక సూత్రాలకు వ్యతిరేకమని, సాగు రంగంలో సంక్షోభానికి ఇది తగిన పరిష్కారం కాదని కెనిచి యోకోయమ అభిప్రాయపడ్డారు. లబ్ధిదారులకు నేరుగా నిధులను బదిలీ చేయడం వల్ల దుర్వినియోగం తగ్గుతుందన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో రూ.1.47 లక్షల కోట్ల మేర వ్యవసాయ రుణాల బకాయిలు ఉండగా, వీటిని మాఫీ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటనలు వెలువడిన విషయం తెలిసిందే. కేంద్రం సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని ఎంత సమర్థవంతంగా, ఏ రూపంలో అమలు చేయగలదన్న దానిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని యోకోయమ అన్నారు. ద్రవ్యలోటును ప్రభుత్వం చేరుకునే విషయంలో తమకు ఎటువంటి సందేహం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది.You may be interested

లోకల్‌ బాండ్లకు పిక్‌ ఎన్‌ హుక్‌

Saturday 12th January 2019

- వేగంగా ఉత్పత్తుల డెలివరీ - స్థానిక బ్రాండ్లకే ఎక్కువ ప్రాధాన్యం - కంపెనీ సీఈవో మోనిష్‌ పత్తిపాటి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అన్ని వస్తువులనూ విక్రయించే ఈ–కామర్స్‌ కంపెనీగా ఆరంభమైన హైదరాబాద్‌ కంపెనీ ‘పిక్‌ ఎన్‌ హుక్‌’... ఇపుడు మిగతా చోట్ల దొరకని విభిన్న ఉత్పత్తుల విక్రయంపై దృష్టిపెట్టింది. తెలంగాణ చేనేత.. నిర్మల్‌ బొమ్మలు.. గద్వాల, ధర్మవరం, వెంకటగిరి చీరలు, కొండపల్లి బొమ్మల వంటి ప్రత్యేక వస్తువులను దేశవ్యాప్తంగా విక్రయించే  ప్రయత్నాలు చేస్తోంది.

ఫ్యూచర్‌ వ్యాపారం.. రూ.40లకే భోజనం

Saturday 12th January 2019

- రూ.40కే భోజనం - సొంత వంటశాలల నుంచి డెలివరీలు పంజాబ్‌: ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి ఫ్యూచర్‌ గ్రూప్‌ అడుగుపోడుతోంది. భోజనప్రియులకు సరసమైన ధరలకే నోరూరించే వంటకాలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ వెల్లడించింది. సొంత వంటశాలలను ఏర్పాటు చేసి.. ఇక్కడ నుంచి రూ.40కే భోజనం, రూ.10కే రెండు సమోసాలను అందించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ కిషోర్ బీయానీ తెలియజేశారు. ఫ్యూచర్‌పే యాప్‌ ద్వారా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తామని వెల్లడించిన ఆయన..

Most from this category