STOCKS

News


ఆధార్ నిబంధనల సవరణకు క్యాబినెట్ ఓకే..

Tuesday 18th December 2018
news_main1545110406.png-23035

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించడాన్ని చట్టబద్ధం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి టెలిగ్రాఫ్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాలకు సవరణలు చేసే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ సోమవారం ఆమోదముద్ర వేసింది. ఆధార్ ఆధారంగా కొత్త మొబైల్ కనెక్షన్స్ ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి దీనితో చట్టబద్ధత లభిస్తుంది. వీటికోసం కస్టమర్లు ఆయా సంస్థలకు తమ ఆధార్‌ను ఇష్టపూర్వకంగా ఇవ్వొచ్చు. మొబైల్‌ సిమ్‌ కార్డుల జారీకి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆధార్‌ తప్పనిసరన్న సెక్షన్ 57ని సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ కంపెనీలు ఆధార్‌ను వినియోగించడంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

అమ్మకానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రోడ్డు ఆస్తులు !

Tuesday 18th December 2018

ముంబై: భారీ రుణ భారంతో కుదేలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ భారత్‌లోని రహదారుల ఆస్తులన్నింటినీ విక్రయానికి పెట్టింది. రహదారుల రంగానికి సంబంధించిన కంపెనీల్లో ఈక్విటీ వాటాను విక్రయించనున్నామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,774 కి.మీల మేర ఉన్న ఏడు ఆపరేషనల్‌ యాన్యుటీ ఆధారిత ప్రాజెక్ట్‌లను, 6,572 కిమీ. మేర విస్తరించిన ఎనిమిది టోల్‌ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో వాటాను విక్రయించనున్నామని పేర్కొంది. అంతేకాకుండా 1,736  కిమీ. మేర విస్తరించిన నిర్మాణంలోని నాలుగు

ఇక ఈడీలూ ఎస్‌బీఐ ఎండీలు కావచ్చు!

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) నియామకాలకు సంబంధించి కేంద్రం సోమవారం కీలక విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం- జాతీయ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లనూ (ఈడీ) ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా ఎంపిక చేయవచ్చు. ఇప్పటి వరకూ ఎస్‌బీఐ ఎండీ కావాలంటే, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లకు (డీఎండీ) మాత్రమే అవకాశం ఉండేది. సంప్రదాయకంగా

Most from this category