STOCKS

News


ఆధార్‌తో రూ.90 వేల కోట్లు ఆదా

Wednesday 11th July 2018
news_main1531327360.png-18215

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో రోజుకు సగటున 3 కోట్ల మంది ఆధార్‌ను వినియోగిస్తున్నారని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ– ఆధార్‌) చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జె.సత్యనారాయణ చెప్పారు. రేషన్, పెన్షన్, రూరల్‌ ఎంప్లాయిమెంట్, స్కాలర్‌షిప్‌ వంటి వాటికి ఎక్కువగా ఆధార్‌ను వినియోగిస్తున్నారన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో (ఐఎస్‌బీ) డిజిటల్‌ ఐడెంటిటీ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆధార్‌ వినియోగంతో రాబడులు కూడా ఎక్కువే. పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ వంటి విభాగాల్లో ఆధార్‌ విశ్లేషణతో రూ.90 వేల కోట్లు ఆదా అయ్యాయి’’ అని వివరించారు. డిజిటల్‌ ఐడెంటిటీలో మరింత పరిశోధనలు అవసరమన్నారు. బయో మెట్రిక్‌ గుర్తింపు, ఆధార్‌ భద్రత, నమోదు, నవీకరణల్లో మరింత పారదర్శకత, సమర్థత తీసుకొచ్చేందుకు విస్తృ పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు ‘ఆన్‌లైన్‌ పోటీ’

Wednesday 11th July 2018

అవకాశాలను సొంతం చేసుకునేందుకు సంస్థల క్యూ ప్రత్యేకంగా యాప్స్‌ విడుదల రేసులోకి పేటీఎం, పైసా బజార్‌ కాయిన్‌ పేరుతో జెరోదా సేవలు నిధులను సమీకరించిన గ్రోవ్‌, నివేష్‌, ఓరోవెల్త్‌ న్యూఢిల్లీ: ఒకవైపు స్మార్ట్‌ఫోన్ల విస్తృతి, డేటా వినియోగం, మరో వైపు పెరుగుతున్న యువతరం ఆర్జనా శక్తి... ఇవన్నీ ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లకు జోష్‌నిస్తున్నాయి. ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఇదో ఆదాయ వనరుగా కనిపిస్తోంది. పేటీఎం, పైసాబజార్‌ కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. చెన్నై కేంద్రంగా

జీఎంఆర్‌కు దక్కని ఫిలిపిన్స్‌ విమానాశ్రయ నిర్వహణ

Wednesday 11th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిలిప్పిన్స్‌లోని క్లార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు జీఎంఆర్‌ గ్రూప్‌కు దక్కలేదు. కాంట్రాక్ట్‌ నిర్వహణ బాధ్యతల కోసం జీఎంఆర్‌ గ్రూప్‌ వేసిన బిడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ అందించే స్కైట్రాక్‌ రేటింగ్‌లో క్వాలిఫై కాకపోవటమే ఇందుకు కారణమని తెలియవచ్చింది. కానీ, జీఎంఆర్‌ దాని ఫిలిప్పిన్స్‌ పార్ట్‌నర్‌ మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ క్లార్‌ విమానాశ్రయ ఈపీసీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికైతే క్లార్క్‌

Most from this category