STOCKS

News


యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు

Wednesday 19th December 2018
news_main1545194506.png-23071

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆధార్ చట్ట సవరణల ప్రతిపాదనల ప్రకారం విశిష్ట గుర్తింపు సంఖ్యల ప్రాధికార సంస్థ యూఐడీఏఐకి మరిన్ని అధికారాలు లభించనున్నాయి. ఒక రకంగా నియంత్రణ సంస్థ పాత్ర పోషించనుంది. బయోమెట్రిక్‌ ఐడీ దుర్వినియోగం చేసే వారిపైనా, నిబంధనలు ఉల్లంఘించేవారిపైనా భారీగా జరిమానాలు విధించేందుకు కూడా దీనికి అధికారాలు దఖలుపడనున్నాయి. సవరణ ప్రతిపాదనల ప్రకారం.. ఆధార్ డేటాబేస్‌లోకి అనధికారికంగా చొరబడిన పక్షంలో 10 ఏళ్ల దాకా కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా మాత్రమే ఉంది. మరోవైపు, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ సిమ్‌ కార్డులు తీసుకునేందుకు కస్టమర్లు స్వచ్ఛందంగా తమ ఆధార్‌ను ఇవ్వొచ్చు. ప్రతిపాదిత సవరణలను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కేంద్రం పార్లమెంటు ముందు ఉంచనుంది. ప్రైవేట్ సంస్థలు ఆధార్ డేటాను వినియోగించుకోవడంపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజా సవరణలు ప్రతిపాదించింది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల ప్రకారం వీటిని రూపొందించింది.



You may be interested

ఆర్‌బీఐ నుంచి మరో రూ.10,000 కోట్లు

Wednesday 19th December 2018

ముంబై: ఆర్థిక వ్యవస్థలోకి మరో 10,000 కోట్ల నిధులను అందించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ నెలలో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా  రూ.40,000 కోట్లు అందించనున్నామని గతంలో ఆర్‌బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంట్లో ఇప్పటికే సగం.. రూ.20,000 కోట్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత లిక్విడిటీ పరిస్థితులను మదింపు చేసి, అదనంగా మరో రూ.10,000 కోట్లు అందించాలని నిర్ణయించామని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నెలలో రెండు దశలుగా రూ.15,000 కోట్ల

నిఫ్టీ 50లో వీక్లీ ఆప్షన్లు

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: నిఫ్టీ-50 సూచీలో వీక్లీ ఆప్షన్లకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. దీంతో ట్రేడర్లకు తమ పోర్ట్‌ఫోలియో నష్టభయాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించుకోవడానికి తాజాగా మరో హెడ్జింగ్‌ టూల్‌ లభించనున్నది. మరోవైపు సెన్సెక్స్‌కు సంబంధించిన వీక్లీ ఫ్యూచర్స్‌, ఆప్షన్ల కాంట్రాక్టులను ఈ నెల 21 నుంచి అందుబాటులోకి తేనున్నామని బీఎస్‌ఈ తెలిపింది.  ప్రతి గురువారం ఎక్స్‌పైరీ... నిఫ్టీ 50 సూచీ వీక్లీ ఆప్షన్లకు ట్రేడర్లు, ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉండనుందో

Most from this category