STOCKS

News


358 ప్రాజెక్టులు... రూ.3.37 లక్షల కోట్ల భారం

Monday 19th November 2018
news_main1542604474.png-22166

న్యూఢిల్లీ: మౌలికరంగంలో వందలాది ప్రాజెక్టులు అధిక వ్యయ భారాన్ని మోస్తున్నాయి. రూ.150 కోట్లు అంతకంటే అధిక అంచనాతో కూడిన 358 ప్రాజెక్టులపై జాప్యం, ఇతరత్రా కారణాలతో  రూ.3.37 లక్షల కోట్ల మేర అదనపు వ్యయ భారం పడినట్టు కేంద్ర ప్రణాళిక, అమలు విభాగం నివేదిక తెలియజేస్తోంది. ‘‘1,361 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.16,78,634 కోట్లు. పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.20,16,361 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పెరిగిన వ్యయం రూ.3,37,726 కోట్లు. వాస్తవ వ్యయం కంటే 20 శాతం అధికం’’ అని తన నివేదికలో పేర్కొంది. ఈ 1,361 ప్రాజెక్టుల్లో 358 ప్రాజెక్టులు అధిక వ్యయ భారాన్ని తెలియజేయగా, మరో 296 ప్రాజెక్టులు అధిక సమయం పట్టనున్నట్టు తెలిపింది. 



You may be interested

బీఎస్‌ఈ, ఎస్‌అండ్‌పీ వేరుబాట

Monday 19th November 2018

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌తో వ్యాపార భాగస్వామ్యానికి ముగింపు పలకాలని బీఎస్‌ఈ నిర్ణయించింది. ఇరు సంస్థల మధ్య జాయింట్‌ వెంచర్‌ ‘ఆసియా ఇండెక్స్‌’ 2013లో ఏర్పాటైంది. ఇరు సంస్థలు కలసి బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సహా పలు సూచీలను నిర్వహిస్తున్నాయి. అయితే, ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌తో చేసుకున్న ఒప్పందం కాల పరిమితి డిసెంబర్‌ 31తో తీరిపోతుందని, ఇకపై పునరుద్ధరించుకోవడం లేదని బీఎస్‌ఈ అధికారులు తెలిపారు. సొంతంగానే సూచీల అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

ప్రభుత్వరంగ సంస్థల షేర్ల బైబ్యాక్‌తో రూ.5,000 కోట్లు

Monday 19th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో కోల్‌ ఇండియా కూడా ఉంది. కోల్‌ ఇండియాలో ఈ నెల మొదట్లో కేంద్రం 3.18 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించడం ద్వారా రూ.5,300 కోట్లు సమీకరించింది. ‘‘ఎనిమిది కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రణాళికలు క్యూలో ఉన్నాయి. వీటితో రూ.5,000 కోట్లు

Most from this category