STOCKS

News


ఆయుష్మాన్‌ భారత్‌తో మూడు లక్షల మందికి ప్రయోజనం

Wednesday 28th November 2018
news_main1543391449.png-22447

న్యూఢిల్లీ: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య స్కీమ్‌ కారణంగా నెలన్నర కాలంలో మూడు లక్షల మంది పేదలు ప్రయోజనం పొందారని ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ చెప్పారు. వీరిలో సగం మంది హాస్పిటలైజేషన్‌ ప్రయోజనాలు పొందారని వివరించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యాపారానికి, పేదలకు అనుకూలంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు కావలసిన నిధులకు అపారమైన వనరులు అవసరమని వివరించారు. మేకింగ్‌ ఆఫ్‌ న్యూ ఇండియా, ట్రాన్స్‌ఫార్మేషన్‌ అండర్‌ మోదీ గవర్నమెంట్‌ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ పుస్తకంలో విద్య, ప్రజా వైద్యం, తదితర అంశాలపై మొత్తం 51 వ్యాసాలున్నాయి. ఈ పుస్తకం తొలి ప్రతిని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అందుకున్నారు. 

 ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో ఒక పేద కుటుంబానికి రూ.5 లక్షల కవరేజ్‌ లభిస్తుంది. ఈ స్కీమ్‌ కారణంగా 10.74 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది. 



You may be interested

'రోబో 2.0'పై టెల్కోల అభ్యంతరం

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: అనేక అవరోధాలను అధిగమించి రిలీజ్‌కు సిద్ధమవుతున్న రోబో సీక్వెల్ 2.0 సినిమాకు ఈసారి టెల్కోల రూపంలో సమస్యలు వచ్చిపడ్డాయి. మొబైల్ ఫోన్లు, టవర్లు ఆరోగ్యానికి చేటు చేస్తాయన్న అర్థం వచ్చేలా ఈ సినిమా ట్రైలర్లు ఉన్నాయంటూ టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ ఆరోపించింది.ఈ నేపథ్యంలో సినిమాకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను ఉపసంహరించాలంటూ సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ)ని

ఎ౾యిరిండియా విక్రయంపై కేంద్రం కసరత్తు..

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి కేంద్రం మళ్లీ కసరత్తు జరుపుతోంది. రుణభారం పేరుకుపోయిన సంస్థను ప్రస్తుత రూపంలో కొనుగోలు చేయటానికి ఎవరూ ముందుకు రాకపోతుండటంతో... కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎయిరిండియా రుణభారంలో 'సింహభాగం' వాటాను, ఆ సంస్థ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్ యూనిట్‌ను ప్రత్యేకంగా మరో సంస్థ కింద విడగొట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్‌ను (ఎస్‌పీవీ)

Most from this category