STOCKS

News


వృద్ధిబాటలో లాజిస్టిక్స్‌

Monday 17th December 2018
news_main1545027210.png-22986

దేశంలోని ప్రధాన రంగాల్లో లాజిస్టిక్స్ కూడా ఒకటి. దేశ జీడీపీలో దాదాపు 13 శాతం వాటాను ఆక్రమించింది. ఇటీవలి మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే.. గత రెండేళ్లలో రియల్ ఎస్టేట్లోని మొత్తం ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్లలో వేర్హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ విభాగం దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంది. గత కొన్నేళ్లుగా లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన సంస్కరణలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలో కెల్లా 2017-18ని లాజిస్టిక్స్ కు ఉత్తమ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయి. పెద్ద పెద్ద దేశీ కంపెనీలు, హెచ్ ఎన్ ఐలు ఈ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇవాన్హో కేంబ్రిడ్జ్ అండ్ క్వాడ్రీల్ గ్రూప్, అసెన్దాస్ ఫస్ట్ స్పేస్, వార్ బర్గ్ పింకస్, డీహెచ్ఎల్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, ఎవర్ స్టోన్ క్యాపిటల్, బ్రూక్ ఫీల్డ్, మోర్గాన్ స్టాన్లీ, టాటా రియల్టీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వంటి ప్రముఖ ఇన్ స్టిట్యూషనల్ ఫండ్స్ ఉన్నాయి. అధిక, స్థిర రాబడి అంచనాలు 
ఇందుకు కారణం.   

లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ పరిశ్రమ వృద్ధికి దోహదపడిన అంశాలను గమనిస్తే..
♦ జీఎస్టీ అమలు
♦ మేకిన్ ఇండియా, డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాల అమలు
♦ ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల ఆవిర్భావం
♦ ఈ-కామర్స్ వృద్ది
♦ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ పరిశ్రమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా
♦ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ల పెరుగుదల

ఎమర్జెన్సీ ఆఫ్ ఆర్గనైజ్డ్ రిటైల్, 3పీఎల్ అండ్ 4పీఎల్, బలమైన వాణిజ్య వృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గ్లోబలైజేషన్, పెట్టబడుల పెరుగుదల, గ్లోబల్ డిమాండ్ పెరుగుదల వంటి పలు ఇతర అంశాలు కూడా పరిశ్రమ వృద్ధికి కారణంగా నిలిచాయి. ఎక్స్ ప్రెస్ లాజిస్టిక్స్, ఈకామర్స్ లాజిస్టిక్స్, సరుకు రవాణ, 3పీఎల్ మార్కెట్ వంటి విభాగాలు పరిశ్రమ వృద్ధికి చోదకంగా నిలిచాయి. 
లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ పరిశ్రమ ప్రతి ఏడాది 10-12 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ వస్తోంది. భవిష్యత్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగవచ్చు.  

2019 ఎలా ఉండొచ్చు?
రానున్న కాలంలో లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. సింగిల్ వేర్ హౌస్ యూనిట్లు.. మల్టీపుల్ యూనిట్లుగా, పార్కులు.. మెగా లాజిస్టిక్స్ పార్కులుగా రూపాంతరం చెందొచ్చు. కేంద్ర ప్రభ్వుత్వపు సంస్కరణల వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతోందని, దీని వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది. లాజిస్టిక్స్ రంగం ఎక్కువగా అసంఘితంగానే ఉంది. ట్రాన్స్ పోర్టేషన్, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి సంబంధించిన ఫ్రైట్ కారిడార్స్, లాజిస్టిక్స్ పార్కులు, స్వేచ్ఛా వాణిజ్య వేర్ హౌసింగ్ జోన్స్, పోర్ట్ ఆధునికీకరణ, ఆటోమేషన్, డిజిటలైజేషన్ వంటి చర్యలు పరిశ్రమ వృద్ధికి దోహదపడతాయి.   
2019 నాటికి ఈ-కామర్స్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీ 2 బిలియన్ డాలర్లకు పైగా చేరొచ్చనే అంచనాలున్నాయి. వార్షికంగా 10-15 శాతం వృద్ది రేటు నమోదు కావొచ్చు. ఈ-కామర్స్ తర్వతా మరో కీలకమైన విభాగం ఎలక్ట్రానిక్స్ అండ్ వైట్ గూడ్స్. టైర్-1 పట్టణాల్లో గణనీయమైన వృద్ది నమోదవుతోంది. రానున్న కాలంలో టైర్-2 పట్టణాల్లో బలమైన వృద్ది నమోదు కావొచ్చు. లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ పరిశ్రమ వృద్ధి వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కొత్త ఆవిష్కరణలు, టెంపరేచర్ కంట్రోల్ వేర్ హౌసింగ్, మల్టీ మోడల్ వేర్ హౌసింగ్, వివిధ అంతస్థుల వేర్ హౌసింగ్ వంటివి తదుపరి లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ పరిశ్రమ తదుపరి వృద్ధికి దోహదపడే అంశాలు. 

-రియలిస్టిక్ రియల్టర్స్ గ్రూప్ డైరెక్టర్ జాన్ థామస్You may be interested

10725-10,675 మధ్య నిఫ్టీకి గట్టి మద్దతు..

Monday 17th December 2018

బెంచ్ మార్క్ ఇండెక్స్ లైన నిఫ్టీ, సెన్సెక్స్ గత వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అయ్యాయి. మార్కెట్లు ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా వంటి ప్రతికూలతలను ఎదుర్కొంది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ర్యాలీ చేశాయి. మార్కెట్ ట్రెండ్ రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్లపై ఆధారపడొచ్చు. మార్కెట్లో స్టాక్ ఆధారిత పనితీరు ఉండొచ్చు. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ మంచి పనితీరు కనబర్చవచ్చు. అలాగే

రూపీ అప్‌.

Monday 17th December 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం లాభాల్లో ట్రేడవుతోంది. బంగారం దిగుమతులు క్షీణించడంతో వాణిజ్య లోటు తగ్గడం సానుకూల ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఉదయం 9:15 సమయంలో రూపాయి 71.84 వద్ద ట్రేడవుతోంది. తన మునపటి ముగింపు (శుక్రవారం) స్థాయి 71.90తో పోలిస్తే 0.08 శాతం క్షీణించింది. ఇకపోతే రూపాయి సోమవారం 71.85 వద్ద ప్రారంభమైంది.  అక్టోబర్‌లో 17.13 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు నవంబర్‌లో 16.67 బిలియన్‌ డాలర్లకు

Most from this category