STOCKS

News


సెజ్‌ల అభివృద్ధికి సమయం పెంచాలి: డెవలపర్లు

Tuesday 11th September 2018
news_main1536641973.png-20151

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్‌లు) అభివృద్ధికి మరింత సమయం కావాలని మొత్తం 13 ఎస్‌ఈజెడ్‌ డెవలపర్లు వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరారు. జీ పీ రియల్టర్స్, జేబీఎఫ్ పెట్రోకెమికల్స్, అరబిందో ఫార్మాలు ఈ జాబితాలో ఉండగా.. ఈనెల 12న (బుధవారం) వాణిజ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగే స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ సమావేశంలో బోర్డ్‌ ఆఫ్‌ అప్రూవల్స్‌ తుది నిర్ణయం వెలువడనుంది. ఇప్పటివరకు తొమ్మిది సార్లు గడువుతేదీ పెంపు అనుమతి పొందిన జీ పీ రియల్టర్స్ నవంబరు 13లోపుగా గురుగ్రామ్‌లోని ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌, ఐటీ సెజ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. సెప్టెంబరు 15తో జేబీఎఫ్, వచ్చే ఏడాది జూలైతో అరబిందో నెల్లూరు సెజ్‌ల అభివృద్ధి గడువుతేదీలు ముగియనున్నాయి.



You may be interested

‘మోటో జీ6 ప్లస్‌’ వచ్చేసింది

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: వేగవంతమైన చార్జింగ్‌ సదుపాయం, అత్యాధునిక కెమెరా టెక్నాలజీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను మోటొరోలా మార్కెట్‌లో ఆవిష్కరించింది.  ‘మోటో జీ6 ప్లస్‌’ పేరిట సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌.. 6జీబీ ర్యామ్‌, 64 అంతర్గత మెమొరీ, 5.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు మోటొరోలా వెల్లడించింది. వెనుకవైపు 12, 5 మెగాపిక్సెల్ డ్యుయల్‌ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ లెన్స్‌ అనుసంధానించటం

ఆసియా-పసిఫిక్‌ జీడీపీలో పెరిగిన భారత్‌ వాటా!

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: ఆసియా-పరిఫిక్‌ ప్రాంత స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో భారత్‌ వాటా గత 17 సంవత్సరాల్లో రెండున్నర శాతానికి పైగా పెరిగింది. 2000లో 14.6 శాతంగా ఉన్న ఈ వాటా 2017లో 17.3 శాతానికి పెరిగిందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తాజా నివేదిక పేర్కొంది.  ‘ఆసియా-పసిఫిక్‌ 2018 ఆర్థిక పరిస్థితుల్లో కీలకాంశాలు’ పేరుతో విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - మొత్తం ప్రపంచ ఉత్పత్తి (జీడీపీ)లో ఆసియా పసిఫిక్‌

Most from this category