STOCKS

News


మార్పు కోసం పది లక్ష్యాలు

Saturday 2nd February 2019
Markets_main1549108103.png-23980

  • జీవన ప్రమాణాలకు నాంది: పీయూష్‌        
  • ప్రగతి పథంలో ముందుకు సాగడమే పది లక్ష్యాల ఉద్దేశం

పది లక్ష్యాలతో భారతదేశ దశ దిశలో మార్పుతెస్తామంటూ సార్వత్రిక ఎన్నికలవేళ మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌తో జనం ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వం పదిలక్ష్యాలను నిర్దేశించింది. బడ్జెట్‌ని ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ రాబోయే పది ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థకి తాత్కాలిక బడ్జెట్‌తో పునాదివేసారు. ఇది తాత్కాలికం మాత్రమే కాదని భారత ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పుకిది నాంది అని ఆయన ప్రకటించారు. పది లక్ష్యాలతో దారిద్య్రం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత వంటి రుగ్మతలను రూపుమాపి సరికొత్త భారతాన్ని నిర్మించడం, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రగతిపథంలో మున్ముందుకు సాగడమే ఈ ప్రభుత్వ ఉద్దేశమని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.
పది లక్ష్యాలు..
1. మౌలిక సదుపాయాల మదుపు:
ప్రజా జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రోడ్లు, రైల్వే, సీపోర్టు, విమానాశ్రయాల అభివృద్ధికి బాటలు వేయ¶æడం. దీనికోసం అధికంగా నిధులు కేటాయించింది. గ్రామసడక్‌ యోజనకింద రూ. 19 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించింది.

2. డిజిటల్‌ ఇండియా :
సరికొత్త ఆవిష్కరణలతో, నూతన కంపెనీల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధికల్పన. ఇందులో భాగంగా దేశంలో లక్ష గ్రామాలను డిజిటల్‌ విలేజెస్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికల రూపకల్పన.

3. హరిత భారతం (క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఇండియా) :
ఇంధన అవసరాలకు పరాయి దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ విద్యుత్‌తో నడిచే వాహనాల వైపు దృష్టిసారించడం. ఫలితంగా పర్యావరణానికి మేలు చేయడంతో హరిత భారత నిర్మాణానికి బాటలు వేసుకోవడం.

4. గ్రామీణ భారతానికి దన్ను :-
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడం. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి గ్రామీణ భారతాన్ని పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడం.

5. నదుల ప్రక్షాళన :-
మానవాళికి ప్రధానాధారమైన జలవనరులను కాపాడుకోవడానికీ, భారత ప్రజలందరికీ పరిశుభ్రమైన, రక్షిత మంచినీటిని అందుబాటులోకి తేవడానికి నదులను ప్రక్షాళన చేయడం.

6. సముద్రాలను జయిద్దాం:-
రాబోయే పదేళ్లలో సముద్రతీర ప్రాంతాలను అభివృద్ధి పరచడం. సముద్ర ఆధారిత ప్రాజెక్టుల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవడం.

7. అంతరిక్షంలోకి దూసుకెళ్లడం:-
అంతరిక్ష రంగానికి అత్య«ధిక ప్రాధాన్యతినివ్వడం. అందులో భాగంగానే బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈ రంగానికి భారీగా నిధుల కేటాయింపు. 2020 కల్లా భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం.

8. పౌష్టికాహారం:-
వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆహారభద్రత అనే దీర్ఘకాలిక లక్ష్యానికి మార్గనిర్దేశనం చేయడం. ఆరోగ్యకరమైన ఆర్గానిక్‌ ఆహారాన్ని పండించుకోవడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించడం.

9. ఆరోగ్యానికి అందలం:-
భారత ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత స్థానాన్ని కల్పించడం. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో మారుమూల గ్రామ ప్రజలతో సహా సర్వజనానికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం.

10. సుపరిపాలన:-
ప్రజాజీవితంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం సా«ధ్యమైన వరకూ తగ్గించి, ప్రజలందరికీ సుపరిపాలనా ప్రయోజనాలందించడం, సత్వర స్పందన, బాధ్యతాయుత, స్నేహపూరిత అధికార యంత్రాంగం, ఇ-గవర్నెన్స్‌కు సోపానం వేయడం.You may be interested

టెలికం నుంచి రూ. 41వేల కోట్ల ఆదాయ అంచనా

Saturday 2nd February 2019

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో టెలికం రంగం నుంచి రూ. 41519. 76 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఏడాది టెలికం రంగ రెవెన్యూ కన్నా ఇది కాస్త అధికం. 2018-19లో టెలికం రంగం నుంచి రూ. 48661కోట్ల ఆదాయం ఉంటుందని ప్రభుత్వం గత బడ్జెట్లో అంచనా వేసింది. కానీ ప్రస్తుతం ఈ మొత్తం రూ. 39245 కోట్లకు పరిమితమయింది. ఆపరేటర్ల నుంచి లైసెన్సు

రక్షణకు రూ.మూడు లక్షల కోట్లు!

Saturday 2nd February 2019

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల కేటాయింపులతో ఎన్డీయే సర్కారు రికార్డు సృష్టించింది. దేశ సరిహద్దుల రక్షణ అవసరాలకు తగ్గట్లుగా అదనపు నిధులు ఇచ్చేందుకూ సిద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో శుక్రవారం తన బడ్జెట్‌ ప్రసంగంలో పీయూష్‌ గోయల్‌.. ‘దేశాన్ని కాపాడుతున్న సైనికులు మాకు గర్వకారణం. అందుకే ఈ ఏడాది వీరికోసం

Most from this category