STOCKS

News


38 శాతం తగ్గిన జీ ఎంటర్‌టైన్మెంట్‌ లాభం

Thursday 11th October 2018
news_main1539231714.png-21033

న్యూఢిల్లీ: 
జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జడ్‌ఈఈఎల్‌) నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 38 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.625 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.386 కోట్లకు తగ్గిందని జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,785 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.2,035 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ పునీత్‌ గోయెంకా తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.1,147 కోట్ల నుంచి రూ.1,386 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. 

చందా, ప్రకటనల ఆదాయాలు పెరుగుతాయ్‌ ! 
బ్రాడ్‌కాస్ట్‌ వ్యాపారం మంచి వృద్ధిని సాధించిందని పునీత్‌ వివరించారు. ప్రకటనల, చందా ఆదాయాలు పెరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకటనల ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.1,211 కోట్లకు, చందా ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.608 కోట్లకు ఎగసిందని వివరించారు. స్పోర్ట్స్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ వ్యాపారాన్ని సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌కు విక్రయిస్తున్నామని, ఈ  విక్రయానికి సంబంధించిన రెండో దశ అమ్మకాలు ఈ క్యూ2లో పూర్తయ్యాయని తెలిపారు. ఈ లావాదేవీ కారణంగా రూ.135 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించారు. భవిష్యత్తులో ప్రకటనల, చందా ఆదాయాలు మరింతగా వృద్ధి చెందగలవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 6.3 శాతం లాభపడి రూ.459 వద్ద ముగిసింది. 
 You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 11th October 2018

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- తన అనుబంధ సంస్థ అదానీ అగ్రో లాజిస్టిక్స్‌ సంస్థను విలీనం చేసుకుంది. పీటీసీ ఇండియా:- బంగ్లాదేశ్‌కు 15ఏళ్ల పాటు 200 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆదేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీఎల్‌ ఎడ్యుకేట్‌:- అమెజాన్‌ అలెక్సా పవర్‌తో వ్యాపార ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది. జీఈ పవర్‌:- వడోదరా, షాహాబాద్‌ యూనిట్లను విస్తరించేందుకు కమిటిని ఏర్పాటు చేసింది. ఆయిల్‌ ఇండియా:- డిబ్రూగర్ & టిన్సుకియా జిల్లాలలో రెండు

అధునాతన ‘డాట్సన్ గో, గో ప్లస్’ కార్లు విడుదల

Thursday 11th October 2018

చెన్నై: జపనీస్‌ ఆటోమేకర్‌ నిస్సాన్‌.. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని  ‘డాట్సన్ గో, గో ప్లస్’  కార్లలో కొత్త వేరియంట్లను మంగళవారం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. దాదాపు 100కు పైగా అప్‌డేట్స్‌, 28 నూతన ఫీచర్లు ఈ వేరియంట్లలో ఉన్నట్లు ప్రకటించింది. గో బ్రాండ్‌ ధర రూ.3.29 లక్షలు కాగా, గో ప్లస్ ధర రూ.3.83 లక్షలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా నిస్సాన్‌ ఇండియా మోటార్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌)

Most from this category