STOCKS

News


అమెజాన్‌, గూగుల్ దోస్తీ

Saturday 20th April 2019
news_main1555736907.png-25238

  • ఫైర్‌టీవీలో యూట్యూబ్‌
  • క్రోమ్‌క్యాస్ట్‌లో ప్రైమ్ వీడియోలు

న్యూఢిల్లీ:  టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపాయి. దీంతో గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇకపై అమెజాన్‌ ఫైర్‌ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో కంటెంట్‌ను గూగుల్‌ క్రోమ్‌క్యాస్ట్‌ యూజర్లు కూడా వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్‌ టీవీ డివైజ్‌లలో యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ కిడ్స్‌ యాప్స్‌ కూడా లభ్యం కానున్నాయి. ఇరు సంస్థలు ఈ విషయం వెల్లడించాయి. అయితే, ఎప్పట్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందనేది నిర్దిష్టంగా చెప్పలేదు. తాజా దోస్తీతో ఇరు సంస్థల మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న విభేదాలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది. అమెజాన్‌ సుమారు నాలుగేళ్ల నుంచి గూగుల్‌కి చెందిన క్రోమ్‌క్యాస్ట్‌ స్ట్రీమింగ్ అడాప్టర్‌ తమ పోర్టల్‌లో విక్రయించడం నిలిపివేసింది.



You may be interested

రీట్స్‌ ద్వారా సీపీఎస్‌ఈ స్థలాల విక్రయం !

Saturday 20th April 2019

-శతృ ఆస్తుల విక్రయానికి కూడా  -కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సం‍స్థల స్థలాల విక్రయానికి రీట్స్‌ విధానాన్ని వినియోగించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అంతేకాకుండా శతృఆస్తుల విక్రయానికి కూడా రీట్స్‌(రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌) విధానాన్ని ఉపయోగించుకునే విషయాన్ని సదరు శాఖ పరిశీలిస్తోంది.  రీట్స్‌ విధానంపై ఆర్థిక శాఖ చూపు... వ్యూహాత్మక విక్రయం కోసం గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన కీలకం కాని ఆస్తులను కేంద్రం విక్రయించనున్నది. ఈ

జెట్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి

Saturday 20th April 2019

- 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు చూడాలి - బ్యాంకులపై భారం మోపొద్దు - ప్రధానికి బ్యాంకు ఉద్యోగుల సంఘం అభ్యర్థన జెట్‌ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలపై దర్యాప్తునకు డిమాండ్‌ ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం

Most from this category