STOCKS

News


అనధికారిక సర్‌చార్జీలతోనే డిజిటల్ చెల్లింపులకు విఘాతం

Monday 4th March 2019
news_main1551673414.png-24414

  • ఐఐటీ ముంబై అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: అనధికారిక సర్‌చార్జీలు, మర్చంట్ డిస్కౌంట్ రేట్లలో (ఎండీఆర్‌) వ్యత్యాసాలు మొదలైనవే దేశీయంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ప్రతిబంధకాలుగా ఉంటున్నాయని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ ముంబై ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇలాంటి వాటివల్ల చిన్న/మధ్య స్థాయి వ్యాపారులు, కస్టమర్లు నష్టపోతున్నారని, ఫలితంగా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదని తెలిపింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ఎ౾ండీఆర్‌ల మధ్య వ్యత్యాసాల కారణంగా వ్యాపార సంస్థలు, కస్టమర్లపై భారం పడుతోందని నివేదిక వివరించింది. 2018లో డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీల పరిమాణం దాదాపు సమాన స్థాయిలో రూ. 5.7 లక్షల కోట్ల మేర నమోదు కాగా .. డెబిట్ కార్డుల ఎ౾ండీఆర్‌ వ్యయాలు రూ. 3,500 కోట్లుగా ఉందని, కానీ క్రెడిట్ కార్డు ఎ౾ండీఆర్‌లతో వ్యాపారులపై రూ. 10,000 కోట్ల భారం పడిందని నివేదిక తెలిపింది. ఇక అనధికారికంగా సర్‌చార్జీలు విధిస్తుండటంతో ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే వారిపై అదనపు భారం పడుతోందని వివరించింది. బ్యాంకులు తమ చెల్లింపుల సర్వీసులను అవుట్‌సోర్స్ చేయడం ద్వారా వ్యాపారులకు మించి సర్‌చార్జీలపరమైన మోసాలకు పాల్పడుతున్నాయని నివేదిక పేర్కొంది.



You may be interested

ఆధార్‌ స్వచ్చంద వినియోగ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం

Monday 4th March 2019

న్యూఢిల్లీ: ఆధార్‌ నంబర్‌ను గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా మొబైల్‌ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు స్వచ్చందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింగ్‌ ఆమోదం తెలిపారు. మొబైల్‌ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ వినియోగాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆర్డినెన్స్‌తో ఇకపై వీటికి ఆధార్‌ను వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, రాజ్యసభ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆధార్‌

భారత్ సుంకాలపై ట్రంప్ గుర్రు..

Monday 4th March 2019

దీటుగా తామూ టారిఫ్‌లు పెంచాల్సి ఉంటుందని వ్యాఖ్యలు వాషింగ్టన్‌:  అమెరికన్ ఉత్పత్తులపై భారత్‌ భారీ సుంకాలు విధిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు."అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో" భారత్ కూడా ఒకటని, ప్రతిగా తాము కూడా భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదే స్థాయిలో సుంకాలు విధించాలని లేదా కనీసం "ఎంతో కొంత, ఏదో ఒక ట్యాక్స్" అయినా విధించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌

Most from this category