STOCKS

News


మీ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డును మార్చుకున్నారా?

Saturday 25th August 2018
news_main1535135422.png-19612

ఎస్‌బీఐ కస్టమర్లందరూ దృష్టి సారించాల్సిన అంశం ఒకటుంది. ఎస్‌బీఐ ఖాతాదారులుగా గతంలో మీరు తీసుకున్న డెబిట్‌ కార్టులను మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎస్‌బీఐ గతంలో ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను మ్యాగ్నటిక్‌ స్ట్రైప్‌ (మ్యాగ్‌స్ట్రైప్‌) కార్డులనే జారీ చేసింది. గత కొంత కాలంగా మరింత భద్రతా కోణంలో ఈఎంవీ చిప్‌లు ఉన్న కార్డులను జారీ చేస్తోంది. ఈ క్రమంలో ఈఎంవీ చిప్‌లు లేని కార్డులను ఈ ఏడాది డిసెంబర్‌ 31లోపు మార్చుకోవాలని ఎస్‌బీఐ ఖాతాదారులను కోరడం జరిగింది. కార్డు ముందు భాగంలో పై వైపున బంగారం వర్ణంలో ఈఎంవీ చిప్‌ ఉంటుంది. తమ కార్డుపై ఇది లేని వారు కచ్చితంగా దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ‘‘ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా మీరు మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డును, ఈఎంవీ చిప్‌ డెబిట్‌ కార్డుగా 2018 ముగిసేలోపు మార్చుకోవాలి’’ అని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది. కార్డుల మార్పిడి అన్నది సురక్షితంగా, ఎటువంటి చార్జీలు లేకుండా చేసుకోవచ్చని బ్యాంకు సూచించింది. 

 

మార్చుకోవడం ఎలా..?
ఈఎంవీ చిప్‌ కార్డున్న కొత్త డెబిట్‌ కార్డు కోసం ఖాతాదారులు తమ ప్రస్తుత కార్డుతోపాటు బ్యాంకు శాఖకు వెళ్లి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా చేసుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉన్న వారు ముందుగా లాగిన్‌ అవ్వాలి. పైన కనిపించే ఆప్షన్లలో ఈ సర్వీసెస్‌ను ఎంచుకోవాలి. ఇందులో ఏటీఎం కార్డు సర్వీసెస్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే అందులో... రిక్వెస్ట్‌ ఏటీఎం/డెబిట్‌ కార్డు ఆప్షన్‌ కనిపిస్తుంది. దీన్ని సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత పేజీలో ఖాతా వివరాలు, రెండు కాలమ్స్‌ ఉంటాయి. ఒకటికి మించి ఖాతాలు ఉంటే, ఏ ఖాతాకు సంబంధించిన కార్డును మార్చుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్‌ చేసుకోవాలి. కింద కాలమ్స్‌లో నేమ్‌ ఆన్‌ ద కార్డు కనిపిస్తుంది. అందులో కార్డుపై పేరు ఏ విధంగా రావాలనుకంటున్నారో అదే ఆర్డర్‌లో పేర్కొనాలి. కింది కాలమ్‌లో వీసా, మాస్టర్‌ కార్డుల్లో ఏ తరహా కార్డు కావాలనుకుంటే దాన్ని ఎంచుకోవాలి. ‍కింద సబ్‌మిట్‌ బటన్‌ ఓకే చేయాలి. తర్వాత పేజీలో కస్టమర్‌ బ్యాంకు వద్ద నమోదు చేసుకున్న చిరునామా చూపిస్తుంది. అది మీ ప్రస్తుత చిరునామాయే అయితే ఓకే చేయాలి. ఆ చిరునామాలో లేకపోతే బ్యాంకు శాఖకు వెళ్లి మార్చుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ కనిపించే చిరునామాకే కార్డు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా నమోదు చేసుకున్న వారి రిజిస్టర్డ్‌ అడ్రస్‌కు కొత్త ఏటీఎం కార్డును బ్యాంకు పంపిస్తుంది. కార్డు వచ్చిన తర్వాత మళ్లీ నెట్‌ బ్యాంకింగ్‌లోకి లాగిన్‌ అయి, ఈ సర్వీసెస్‌లో, ఏటీఎం కార్డు సర్వీసెస్‌లో, ఎటీఎం కార్డు ‍యాక్టివేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకుని వివరాలు నమోదు చేయడం ద్వారా కార్డును యాక్టివేట్‌ చేసుకోవచ్చు.



You may be interested

11,620పై స్థాయిలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 25th August 2018

47 పాయింట్లు అప్‌ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం విదేశీ మార్కెట్‌లో 47 పాయింట్ల లాభంతో 11,621 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ 50 ఫ్యూచర్స్‌ ముగింపు 11,571 పాయింట్ల కన్నా అధిక స్థాయిలో ఉందని గమనించాలి. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి అనూహ్యా పరిస్థితులు తలెత్తనప్పుడు సోమవారం నిఫ్టీ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.  అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం లాభాల్లో ముగియడం సానుకూల అంశం. నాస్‌డాక్‌ 68 పాయింట్ల లాభంతో 7,946

ఈఎంఐ కట్టకపోతే క్రెడిట్‌స్కోరుకు విఘాతం: క్లియర్‌స్కోర్‌

Friday 24th August 2018

ఈఎంఐ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయితే ఏమవుతుందిలే?నన్న నిర్లక్ష్యం పనికిరాదు. ఇది క్రెడిట్‌ స్కోరుపై చాలా ప్రభావమే చూపిస్తుందంటున్నారు క్లియర్‌స్కోర్‌ (క్రెడిట్‌ బ్యూరో) సహ వ్యవస్థాపకుడు, గ్లోబల్‌ సీఈవో జస్టిన్‌బాసిని. భారత్‌లో రుణ మార్కెట్‌ పరిస్థితులు, క్రెడిట్‌ స్కోరుపై ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.    భారత్‌లో 22-44 వయసు వారు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నట్టు జస్టిస్‌ బాసిని తెలిపారు. రుణాలను పొందేందుకు ఇది ముఖ్యమైన వయసుగా పేర్కొన్నారు. ప్రజలు

Most from this category