STOCKS

News


యస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌గా అంబానీ..

Wednesday 28th November 2018
news_main1543396758.png-22454

యస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా ప్రెసిడెంట్‌, హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌గా అమర్‌ అంబానీ నియమితులయ్యారు. యస్‌ బ్యాంక్‌కు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, బ్రోకరేజ్‌ సబ్సిడరీయే ఈ యస్‌ సెక్యూరిటీస్‌. ‘అమర్‌ అంబానీకి అభినందనలు తెలియజేస్తున్నాను. అమర్‌, ఈయన బృందం యస్‌ సెక్యూరిటీస్‌ ప్రయాణంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. వీరంతా సంస్థ మార్కెట్‌ యాక్సెస్‌ను, సముపార్జన సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను’ అని యస్‌ సెక్యూరిటీస్‌ చైర్మన్‌ రాణా కపూర్‌ తెలిపారు. ఒక పూర్తి స్థాయి రీసెర్చ్‌ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. యస్‌ బ్యాంక్‌లోకి రాక ముందు అమర్‌ అంబానీ.. ఐఐఎఫ్‌ఎల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌లో హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌గా ఉన్నారు. క్లయింట్స్‌కు విలువ చేకూర్చే, ఉత్తమమైన ప్రొడక్టులను అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని అమర్‌ అంబానీ తెలిపారు.    



You may be interested

డాలర్‌ బాండ్‌ మార్కెట్‌లో యస్‌ బ్యాంక్‌ భారీ పతనం

Wednesday 28th November 2018

హాంగ్ కాంగ్‌లో 3.3 సెంట్లు తగ్గి 88.2 సెంట్లకు పతనం ఈ ఏడాదిలో 5.2 శాతం తగ్గుదల భవిష్యత్‌ నిధుల సమీకరణ ఇబ్బందిగా మారే అవకాశం యస్‌ బ్యాంక్‌ జారీ చేసినటువంటి డాలర్‌ బాండ్‌ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను ‘జంక్‌’ రేటింగ్‌కు కుదించినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించిన నేపథ్యంలో బాండ్‌ విలువ రికార్డు స్థాయి కనిష్టానికి కుంగిపోయింది. ఈ రేటింగ్‌ సంస్థ పర్యవేక్షిస్తున్న

ఈ స్టాక్స్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌

Wednesday 28th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..  టాటా స్టీల్‌ టాటా స్టీల్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. బై రేటింగ్‌ ఇస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.790గా నిర్ణయిస్తున్నాం. దేశీయంగా బలమైన క్యాష్‌ ఫ్లో ఉండటం, కొనుగోళ్లు వంటివి సానుకూల అంశాలు. కంపెనీ క్యూ2 ఫలితాలు అంచనాలు మించాయి. రుణ భారం తగ్గించుకోవాలనే లక్ష్యం, తన సబ్సిడరీ ద్వారా ఉషా మార్టిన్‌ కొనుగోలు ప్రకటన వంటి వాటి వల్ల

Most from this category