STOCKS

News


యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎంపిక ఖరారు

Friday 14th December 2018
news_main1544763299.png-22916

ముంబై: యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎంపిక ఖరారైంది. యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా గత నెలలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చైర్మన్‌ ఎంపికను పూర్తి చేశామని, ఆమోదం కోసం ఆర్‌బీఐకు పంపించామని యస్‌ బ్యాంక్‌ గురువారం తెలిపింది. అయితే ఎవరిని చైర్మన్‌గా ఎంపిక చేసింది, ఇతర వివరాలను బ్యాంక్‌ వెల్లడించలేదు. మరోవైపు సీఈఓ, ఎమ్‌డీ కోసం సెర్చ్‌ అండ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్‌ఎస్‌సీ) కసరత్తు చేస్తోందని యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. ఆర్‌బీఐ నిర్దేశించిన గడువులోగానే ఈ పదవిని భర్తీ చేస్తామని తెలిపింది. ఎస్‌ఎస్‌సీ సూచించిన పేరును వచ్చే నెల 9లోపు ఆర్‌బీఐకి నివేదిస్తామని వివరించింది. 
యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ పదవీ కాలాన్ని మరో దఫా పొడిగించడానికి ఆర్‌బీఐ అంగీకరించలేదు. వచ్చే నెల 31తో ఆయన పదవీ కాలం ముగియనున్నందున కొత్త ఎమ్‌డీని, సీఈఓను ఎంపిక చేసుకోవలసిందిగా యస్‌బ్యాంక్‌ను ఆర్‌బీఐ ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆదేశించింది. చైర్మన్‌ పేరును ఆమోదం కోసం ఆర్‌బీఐకు పంపించిన నేపథ్యంలో బీఎస్‌ఈలో గురువారం యస్‌ బ్యాంక్‌ షేర్‌ 6.4 శాతం నష్టంతో రూ.174.70 వద్ద ముగిసింది. 



You may be interested

ఐఓసీ షేర్ల బైబ్యాక్‌ @ రూ.4,435 కోట్లు

Friday 14th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ.4,435 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. అంతేకాకుండా రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని ఐఓసీ గురువారం తెలిపింది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌ను రూ.149 ధరకు బైబ్యాక్‌ చేయనున్నామని పేర్కొంది. ఈ బైబ్యాక్‌ ధర గురువారం ఐఓసీ షేర్

పీఎస్‌యూ బ్యాంకులకు అదనంగా రూ.30,000 కోట్లు

Friday 14th December 2018

న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ చేయలేని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) అదనంగా రూ.30,000 కోట్ల నిధుల సాయం అందించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తాము సొంతంగా రూ.58,000 కోట్లను 2019 మార్చి నాటికి స్టాక్‌ మార్కెట్ల

Most from this category