News


యస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రాజీనామా

Friday 1st February 2019
Markets_main1549027249.png-23954

న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ ప్రళయ్ మండల్ గురువారం తన పదవికి రాజీనామాచేశారు. రిటైల్‌ అండ్‌ బిజినెస్‌ బ్యాంకింగ్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్న ఈయన.. తన రాజీనామా లేఖను జనవరి 31న అందించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో బ్యాంక్‌ తెలియజేసింది. మార్చి 31లోపు ఈయనకు నోటీసు అందజేస్తామని పేర్కొంది. 2012 నుంచి ఈయన యస్‌బ్యాంకుకు సేవలందిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.



You may be interested

బడ్జెట్‌తో ప్రయోజనం ఎవరెవరికి?

Saturday 2nd February 2019

మధ్యంతర బడ్జెటే అయినా పలు వర్గాలకు భారీ ప్రయోజనాలతో, సంతోషపెట్టే నిర్ణయాలతో మోదీ సర్కారు 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా తాత్కాలిక బడ్జెట్‌లో ఎటువంటి విధానపరమైన నిర్ణయాలకు అవకాశం లేని సంప్రదాయాన్ని బ్రేక్‌ చేసింది. మరి ఈ  బడ్జెట్‌ వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందన్నది గమనిస్తే...    రైతులు: రెండు హెక్టార్ల (5 ఎకరాల్లోపు)ల్లోపు భూమి ఉన్న రైతుకు ఏడాదికి రూ.6,000ను మూడు వాయిదాల్లో రూ.2,000 చొప్పున ఆర్థిక సాయంగా

ద్రవ్యోల్బణంపై విజయం: గోయెల్‌

Friday 1st February 2019

ధరల పెరుగుదల వేగాన్ని ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకున్నట్లు ఆర్థిక మంత్రి పియూష్‌ గోయెల్‌ తెలిపారు. అలాగే పేదలపై అసమంజస పన్ను భారం పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల రేటును సగటున 4.6 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. 2009-2014 మధ్య సగటు ద్రవ్యోల్బణం రేటు 10.1 శాతమని పేర్కొన్నారు.  2018 డిసెంబర్‌లో ద్రవ్యల్బణం కేవలం 2.19 శాతమన్న గణాంకాలను కూడా ఆయన ఉటంకించారు. భారత రైతులు ప్రస్తుతం తమ ఆదాయాల్లో

Most from this category