News


మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలు లేవు

Friday 28th September 2018
news_main1538109627.png-20665

ముంబై: మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని యస్‌బ్యాంక్‌ స్పష్టం చేసింది. మొండి బకాయిలను కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అని ఇటీవలనే నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) యస్‌బ్యాంక్‌ని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా యస్‌బ్యాంక్‌ ఈ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తమ స్థూల మొండి బకాయిలు 1.3 శాతంగా, నికర మొండి బకాయిలు 0.59 శాతంగా ఉన్నాయని పేర్కొంది. భారత బ్యాంకింగ్‌ చరిత్రలోనే తమ మొండి బకాయిల గణాంకాలు అత్యుత్తమైనవని వివరించింది. కాగా బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ పదవీ కాలాన్ని  ఈ ఏడాది జనవరి వరకూ ఆర్‌బీఐ కుదించిన విషయం తెలిసిందే. 



You may be interested

ఈ రెండు కంపెనీల్లో ఎంత ఇన్వెస్ట్‌ చేశారు ?

Friday 28th September 2018

న్యూఢిల్లీ:  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌... ఏ మేరకు ఇన్వెస్ట్‌ చేశాయో వెల్లడించాలని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలను అడిగింది.లిక్విడిటీ భయాలు నెలకొన్న నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ను సెబీ ఈ వివరాలను కోరిందని సమాచారం. ఈ రెండు కంపెనీల్లో ప్రస్తుతమున్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రోల్‌ఓవర్‌ చేయవద్దని సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సూచించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  రుణాల చెల్లింపుల్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు విఫలమైన

ఆహార శుద్ధి రంగంలోకి మరిన్ని ఎఫ్‌డీఐలు!

Friday 28th September 2018

ముంబై: ఆహార శుద్ధి రంగానికి ఊతమిచ్చేందుకు గాను మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఈ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐ నియంత్రణలను సరళీకరించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ రాజీవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఫిక్కీ నిర్వహిస్తున్న మూడు రోజుల ‘వరల్డ్‌ ఆఫ్‌ ఫుడ్‌ ఇండియా’ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే 8.7 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు ఆహార శుద్ధి రంగంలోకి వచ్చాయి.

Most from this category