STOCKS

News


యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్ల సయోధ్య

Wednesday 30th January 2019
news_main1548822898.png-23889

-చెరొక డైరెక్టర్‌ను నియమించడానికి అంగీకారం

న్యూఢిల్లీ: యస్‌బ్యాంక్‌ ప్రమోటర్లు-రాణా కపూర్‌, మధు కపూర్‌ల మధ్య సయోధ్య కుదిరింది. ఈ సయోధ్యలో భాగంగా ఇరువురు ప్రమోటర్లు చెరో డైరెక్టర్‌ను నియమించడానికి అంగీకరించారు. తదుపరి బోర్డ్‌ సమావేశం జరిగే ఏప్రిల్‌ నెలలో ఈ డైరెక్టర్ల పేర్లను ప్రకటిస్తారని యస్‌బ్యాంక్‌ తెలిపింది. కాగా ఈ నెల 31తో ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ పదవీ కాలం ముగుస్తోంది. రాణా కపూర్‌ వారసుడిగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ మార్చి 1లోపు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించేవరకూ తాత్కాలిక ఎమ్‌డీ, సీఈఓగా వచ్చే నెల 1 నుంచి అజయ్‌ కుమార్‌ వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన నాన్‌-ఎగ్జిక్యూటివ్‌, నాన్‌-ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.You may be interested

హెచ్‌సీఎల్‌ లాభం రయ్‌

Wednesday 30th January 2019

రూ. 2 డివిడెండ్‌ క్యూ3లో లాభం 19 శాతం అప్‌; రూ. 2,611 కోట్లు న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 2,611 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 2,194 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మరోవైపు, సంస్థ ఆదాయం సుమారు 23 శాతం వృద్ధితో రూ. 12,808

బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా పుర్వార్‌?

Wednesday 30th January 2019

ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి సిఫారసు న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పదవికి ఎంటీఎన్‌ఎల్‌ సీఎండీ ప్రవీణ్‌ కుమార్‌ పుర్వార్‌ పేరును ప్రభుత్వరంగ సంస్థల నియామక బోర్డు సిఫారసు చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుత సీఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ పదవీకాలం జూన్‌తో ముగియనుంది. ఏడాదిన్నర క్రితం శ్రీవాస్తవ బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టగా, తన పదవీకాలంలో సంస్థ కార్యకలాపాలను గాడిలో పెట్టే చర్యలను అమలు చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.672

Most from this category