STOCKS

News


యస్‌ బ్యాంక్ మాజీ బాస్ బోనస్ వెనక్కి

Saturday 18th May 2019
news_main1558153764.png-25817

  • ఆర్‌బీఐ ఆదేశాలతో అసాధారణ నిర్ణయం
  • రాణా కపూర్‌కి చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్ ఉపసంహరణ

న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, మొండిబాకీల సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ తాజాగా అసాధార౾౾ణ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మాజీ ఎండీ రాణా కపూర్‌కు చెల్లించిన రూ. 1.44 కోట్ల బోనస్‌లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. బోనస్‌ కింద 2014-15లో రూ. 62.17 లక్షలు, 2015-16లో చెల్లించిన రూ. 82.45 లక్షల మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్‌ ఆదేశాల మేరకు వెనక్కి తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను కపూర్‌కు బోనస్‌లేమీ చెల్లించలేదని పేర్కొంది. 2004లో ప్రారంభమైన యస్‌ బ్యాంక్ వ్యవస్థాపకుల్లో కపూర్‌ కూడా ఒకరు. ఆయనకు ఇప్పటికీ బ్యాంకులో 4.32 శాతం వాటా కూడా ఉంది. నిబంధనల అమలుపరమైన వివాదాల కారణంగా కపూర్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు ఆర్‌బీఐ నిరాకరించడంతో ఆయన వైదొలగాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రూ. 6 కోట్ల వార్షిక ప్యాకేజీతో రవ్‌నీత్ గిల్‌ నియమితులయ్యారు. 

ముందు జాగ్రత్త చర్య...
మరోవైపు, బ్యాంకు బోర్డులో రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్‌ ఆర్ ‍గాంధీని అదనపు డైరెక్టరుగా ఆర్‌బీఐ నియమించడం ముందుజాగ్రత్త చర్యగా అనలిస్టులు అభిప్రాయపడ్డారు. గతంలో ధన్‌లక్ష్మి బ్యా్ంక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)ల్లో కూడా ఆర్‌బీఐ అదనపు డైరెక్టర్లను నియమించిన సంగతి గుర్తు చేశారు. ఈ రెండింటి పరిస్థితి దారుణంగా ఉండేదని, వీటితో పోలిస్తే చాలా పెద్ద సంస్థ అయిన యస్‌ బ్యాంక్‌ విఫలమైన పక్షంలో మరిన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ వ్యవహరించి ఉంటుందని వారు పేర్కొన్నారు. "యస్ బ్యాంక్‌ ఖాతాల్లో మరిన్ని అవకతవకలకు ఆస్కారం ఉండొచ్చని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో కొన్ని సమస్యలు, బలహీన ఆర్థిక పరిస్థితులు ఉండటం.. ఇంత పెద్ద బ్యాంకు గానీ విఫలమైతే వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందునే ఆర్‌బీఐ ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకుని ఉంటుంది" అని మెక్వారీ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. అటు గాంధీ నియామకం సానుకూల, నిర్మాణాత్మక చర్యగా యస్‌ బ్యాంక్ అభివర్ణించింది. పటిష్టమైన యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ పూర్తి స్థాయిలో తోడ్పాడు అందిస్తోందని పేర్కొంది. గాంధీ నియామకం వల్ల కార్యకలాపాలకేమీ ఆటంకాలు ఉండబోవని తెలిపింది. You may be interested

రెండంకెల వృద్ధే లక్ష్యం!

Saturday 18th May 2019

దేశం మధ్యాదాయ చట్రంలోకి వెళ్లకపోవచ్చు ఈఏసీ- పీఎం సభ్యురాలు షమికా రవి న్యూఢిల్లీ: రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అవసరమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) సభ్యురాలు షమికా రవి చెప్పారు. 7 శాతం వృద్ధితో సరిపెట్టుకోకూడదని ఆమె స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదిగే క్రమంలో మధ్యలోనే ఆగిపోయే ‘మధ్యాదాయ చట్రం’లో భారత్‌ ఇరుక్కుపోతుందంటూ సహచర ఈఏసీ-పీఎం సభ్యుడు రతిన్‌రాయ్‌ చేసిన వ్యాఖ్యలను

అరవింద్‌ లాభం రూ.67 కోట్లు

Saturday 18th May 2019

ఒక్కో షేర్‌కు రూ.2 డివిడెండ్‌  ఎన్‌సీడీల ద్వారా రూ.300 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అరవింద్‌ గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.115 కోట్ల నికర లాభం వచ్చిందని అరవింద్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,863 కోట్ల నుంచి రూ.1,879 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అరవింద్‌ కంపెనీ నుంచి

Most from this category