STOCKS

News


యస్‌ బ్యాంక్ చైర్మన్‌ అశోక్ చావ్లా రాజీనామా

Thursday 15th November 2018
news_main1542259542.png-22041

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్‌ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్‌ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్ వసంత్ గుజరాతి కూడా రాజీనామా చేసినట్లు యస్‌ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అయిదేళ్ల పాటు అదనపు డైరెక్టర్‌ (స్వతంత్ర)గా ఉత్తమ్‌ ప్రకాశ్ అగర్వాల్‌ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు యస్‌ బ్యాంక్ తెలిపింది. బ్యాంకు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కార్యకలాపాలకు పూర్తి సమయం వెచ్చించగలిగే చైర్మన్ అవసరమవుతారనే ఉద్దేశంతోనే వైదొలగుతున్నట్లు చావ్లా తెలిపారని వివరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్ర మేరకు రాబోయే రోజుల్లో కొత్త చైర్మన్‌ నియామకాన్ని ప్రకటిస్తామని యస్‌ బ్యాంక్ తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేసిన చావ్లా.. అటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. యస్‌ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకోవాలని, జనవరి 31లోగా ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. 



You may be interested

అశోక్ చావ్లా రాజీనామాతో యస్‌ బ్యాంక్‌ క్రాష్‌

Thursday 15th November 2018

ముంబై: యస్‌ బ్యాంక్‌ షేరు ధర గురువారం ఉదయం 8 శాతం మేర పతనమైంది. ఇంట్రాడేలో రూ.202 కనిష్ట స్థాయిని నమోదుచేసింది. 11 గంటల సమయానికి ఏడున్నర శాతం నష్టంతో రూ.205 వద్ద కొనసాగుతోంది. నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ (ఇండిపెండెంట్‌) చైర్మన్‌గా బ్యాంకుకు సేవలందిస్తున్న అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేసినట్లు బుధవారం మార్కెట్‌ ట్రేడింగ్‌ ముగిసిన తరువాత బోర్డ్‌ బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

ఐడియా నష్టాలు రూ.4,973 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,973 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేడెట్‌) వచ్చాయి. 42.2 కోట్ల మంది వినియోగదారులతో భారత్‌లో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించిన ఈ కంపెనీ  రూ.7,663 కోట్ల ఆదాయాన్ని (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి స్థూల రుణభారం రూ.1,26,100 కోట్లుగా ఉందని వోడాఫోన్‌ ఐడియా తెలిపింది. రూ.13,600 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయని,

Most from this category