STOCKS

News


కపూర్‌ పదవీ కాలాన్ని పొడిగించండి

Wednesday 26th September 2018
news_main1537939418.png-20583

ముంబై: యస్‌ బ్యాంక్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాణా కపూర్‌ పదవీ కాలాన్ని కనీసం మరో మూడు నెలలు పొడిగించాలని ఆర్‌బీఐని కోరాలని యస్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కంపెనీ కీలకమైన బోర్డ్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు వెల్లడించింది. మరోవైపు కపూర్‌ వారసుడి ఎంపిక కోసం సెర్చ్‌, సెలక్షన్‌ కమిటీని కూడా డైరెక్టర్ల బోర్డ్‌ నియమించింది. దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికలో భాగంగా సీనియర్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్స్‌, రజత్‌ మోంగా, ప్రలయ్‌ మండల్‌లను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమించాలని కూడా బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. 
రాణా కపూర్‌ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కుదిస్తూ ఆర్‌బీఐ ఇటీవలే ఆదేశాలిచ్చింది. షెడ్యూల్‌ ప్రకారమైతే, ఆయన పదవీ కాలం 2021, సెప్టెంబర్‌ వరకూ ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని కుదించడానికి గల కారణాలను ఆర్‌బీఐ వెల్లడించింది. కాగా యస్‌ బ్యాంక్‌ను 2004లో  స్థాపించినప్పటి నుంచి రాణా కపూర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పనిచేస్తున్నారని, ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేయడానికి చాలా సమయం పడుతుందని యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలు ఖరారు చేసే సమయం, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకూ రాణా కపూర్‌నే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగించాలని ఆర్‌బీఐను కోరాలని డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించింది. ఒకవేళ ఆర్‌బీఐ అనుమతిస్తే, ఏజీఎమ్‌ పూర్తయ్యేంత వరకూ (వచ్చే ఏడాది సెప్టెంబర్‌) ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కూడా డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించింది. 
రాణా కపూర్‌ను సెలవులపై పంపాలి....
మరోవైపు కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యేంత వరకూ రాణా కపూర్‌ను సెలవుపై పంపించాలని బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన దివంగత అశోక్‌ కపూర్‌ భార్య మధు కపూర్‌ డైరెక్టర్ల బోర్డ్‌కు ఒక లేఖ రాశారు. అంతే కాకుండా రాణా కపూర్‌ హయాంలో ఇచ్చిన రుణాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ను కూడా నిర్వహించాలని ఆమె కోరారు. యస్‌బ్యాంక్‌లో రాణా కపూర్‌కు 10.66 శాతం, మధు కపూర్‌కు 8 శాతం చొప్పున వాటాలున్నాయి. 
ఆర్‌బీఐ రెండో కుదింపు
బ్యాంక్‌ సీఈఓల పదవీకాలాన్ని ఆర్‌బీఐ కుదించడం ఇది రెండోసారి. గతంలో యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ శిఖా శర్మ పదవీ కాలాన్ని కూడా ఆర్‌బీఐ తగ్గించింది. ఈ రెండు బ్యాంకులు మొండి బకాయిల విషయంలో చెరో రూ.10,000 కోట్లు తక్కువ చేసి చూపెట్టాయని ఆర్‌బీఐ గుర్తించింది. అందుకే ఈ చర్యలు తీసుకుంది.
ఏడాది కనిష్టానికి యస్‌ బ్యాంక్‌ షేర్‌ 
రాణా కపూర్‌ పదవీ కాలాన్ని కుదిస్తూ, ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి  యస్‌ బ్యాంక్‌ షేర్‌ దాదాపు 40 శాతం వరకూ నష్టపోయింది. కీలకమైన డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం నేపథ్యంలో  మంగళవారం తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.199ను తాకిన ఈ షేర్‌ చివరకు 2.8 శాతం నష్టంతో రూ. 220 వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసిన తర్వత బోర్డ్‌ మీటింగ్‌ వివరాలు వెల్లడయ్యాయి. You may be interested

చర్యల కంటే పోస్ట్‌మార్టమ్‌ చేయడం తేలికే

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో తదుపరి సంక్షోభం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఇచ్చిన రుణాల రూపంలో రానుందంటూ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తిప్పికొట్టారు. అవసరమైన సమయంలో చర్యలు తీసుకోవడం కంటే శవ పంచనామా (పోస్ట్‌మార్టమ్‌/జరిగిన తర్వాత విశ్లేషణ) చేయటం సులువేనని వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేయడానికి పూర్వం రాజన్‌ ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారు. అప్పట్లో

అపర కుబేరుడు అంబానీ!!

Wednesday 26th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో బార్‌క్లేస్ హురున్ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2018లో కూడా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన టాప్‌-1 స్థానంలో ఉండటం ఇది వరసగా ఏడోసారి. సుమారు రూ.1,000 కోట్లకు పైగా సంపద గల సంపన్న భారతీయులతో బార్‌క్లేస్‌ ఈ జాబితా రూపొందించింది. ఈ సారి లిస్టులో చోటు

Most from this category