STOCKS

News


టెంప్ట్‌ అయి ‘యస్‌’ అనవద్దు!

Tuesday 2nd October 2018
news_main1538462881.png-20791

యస్‌బ్యాంకు షేరుకు దూరం
నిపుణుల సూచన
రాణాకపూర్‌ నిష్క్రమించాల్సిందేనని ఆర్‌బీఐ తేల్చిచెప్పినప్పటి నుంచి మార్కెట్లో యస్‌ బ్యాంక్‌ షేరు కుప్పకూలుతూ వస్తోంది. షేరు పతనాన్ని అడ్డుకునేందుకు మేనేజ్‌మెంట్‌ ఎన్ని యత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా కపూర్‌ వారసుడి ఎంపికకు సెర్చ్‌ కమిటీని నియమిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. దీంతో పాటు విశ్వాసం చూరగొనే దిశగా ఉన్నట్లుండి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు డిపాజిట్లలో 41 శాతం వృద్ధి నమోదు చేశామని, అడ్వాన్సుల్లో 65 శాతం పెరుగుదల నమోదయిందని తెలిపింది. ఫలితాలు బాగుండడంతో బుధవారం ట్రేడింగ్‌లో బ్యాంకు షేరు కొనాలని రిటైలర్లు భావించే అవకాశాలున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు వద్దని, ఫలితాలు చూసి టెంప్టయి గుడ్డిగా కొనుగోళ్లు చేయవద్దని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు ఆదరాబాదరాగా ఫలితాలు ప్రకటించడం సందేహాలకు తావిస్తోందంటున్నారు. తాజా పతనంతో వాల్యూషన్లు తగ్గినా బ్యాంకు భవిష్యత్‌ ప్రయాణంపై అనిశ్చితి నీడలు తొలగేవరకు షేరుకు దూరంగా ఉండాలంటున్నారు.

ఆర్‌బీఐ చెప్పిన సమయానికి కొత్త సీఈఓని ఎంపిక చేస్తామని బ్యాంకు చెబుతోంది. వచ్చే జనవరి నాటికి సీఈఓ ఎంపిక పూర్తయి, తను బాధ్యతలు చేపట్టినా కుదురుకునేసరికి అప్పటికి దాదాపుగా ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చేస్తుంది. అందువల్ల కొత్త సీఈఓ వ్యూహాలు, పనితీరు మదింపు కొత్త ఆర్థిక సంవత్సరంలోనే సాధ్యమవుతుంది. దీంతో పాటు ఒకపక్క మనీ మార్కెట్లో పరిస్థితి టైట్‌గా మారడం మార్జిన్లపై పెను ప్రభావం చూపవచ్చు. మరోవైపు బ్యాంకుపై ఆర్‌బీఐ విడుదల చేసే రిస్క్‌ అసెస్‌మెంట్‌ నివేదిక ఎలా ఉంటుందో తెలీదు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌కంపెనీలకు ఇచ్చిన రుణాలపై ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలీదు. మరోవైపు బ్యాంకు ఆస్తుల నాణ్యతపై కోఫౌండర్‌ మధు కపూర్‌ లేవనెత్తిన సందేహాలు తీరలేదు. ఇన్ని ప్రశ్నలు చుట్టుముట్టిఉన్న సమయాన చిన్నపాటి ర్యాలీ కనిపించిందన్న హడావుడిలో బ్యాంకు షేరును తొందరపడి కొనడం మంచిదికాదని నిపుణుల సలహా. కొన్ని నెలలు వేచిచూసి కొత్త సీఈఓ పనితీరు, ఆర్‌బీఐ తీసుకునే చర్యలు, బ్యాంకు ఆస్తుల నాణ్యత తదితర అంశాలను పరిశీలించి ఎంటర్‌ కావడం ఉత్తమమని వారి సూచన. 
 You may be interested

మార్కెట్‌ క్యాప్‌లో టాప్‌-10 కంపెనీలివే..

Tuesday 2nd October 2018

జూలై, ఆగస్ట్‌ నెలల్లో ర్యాలీ చేసిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గత నెలలో కరెక‌్షన్‌కు గరయ్యింది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ అటు ఇటు మారిపోయి ఉంటుంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో అధిక మార్కెట్‌ క్యాప్‌ కలిగిన టాప్‌-10 కంపెనీలను గమనిస్తే..     ర్యాంక్‌        కంపెనీ            మార్కెట్‌ క్యాప్‌ (రూ.లక్ష కోట్లు) 1            టీసీఎస్‌            8.63 2            రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌    7.80 3      .....

బంధన్‌ బ్యాంక్‌ ...ఇన్వెస్టర్లూ జాగ్రత్త..

Tuesday 2nd October 2018

లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ శుక్రవారం కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ పారితోషికాన్ని స్తంభింపజేసింది. దీంతో బంధన్‌ బ్యాంక్‌ ఇన్వెస్టర్లు ఎగ్జిట్‌ అవుతున్నారు. యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ నిబంధనలకు అనువుగా బంధన్‌ బ్యాంకులో నాన్‌-ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను మూడేళ్లలో (2015 ఆగస్ట్‌ నుంచి)

Most from this category