STOCKS

News


యశోవర్థన్‌ బిర్లా.. రుణ ఎగవేతదారు !

Tuesday 18th June 2019
news_main1560840353.png-26381

  • ప్రకటించిన యూకో బ్యాంక్‌

న్యూఢిల్లీ: యశోవర్థన్‌ బిర్లాను రుణ ఎగవేతదారుగా యూకో బ్యాంక్‌ ప్రకటించింది. బిర్లా సూర్య లిమిటెడ్‌ కంపెనీ కోసం యశోవర్థన్‌ బిర్లా రూ.67.55 కోట్ల రుణం తీసుకున్నారని, ఎన్ని నోటీసులిచ్చినా, ఈ రుణం చెల్లించకపోవడంతో అతన్ని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తున్నామని యూకో బ్యాంక్‌ తెలిపింది. 2013లోనే ఈ రుణాన్ని మొండి బకాయిగా గుర్తించామని, అప్పటి నుంచి ఈ రుణాన్ని చెల్లించాల్సిందిగా పలు నోటీసులు పంపించామని, కానీ ఆయన స్పందించలేదని పేర్కొంది. ఏదైనా బ్యాంక్‌ ఒక వ్యక్తిని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తే, ఆ వ్యక్తికి ఇతర బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు ఎలాంటి రుణాన్ని మంజూరు చేయవు. కాగా 665 మంది రుణ ఎగవేత దారులు/ సంస్థల జాబితాను యూకో బ్యాంక్‌ తన వెట్‌సైట్లో ఉంచింది. ఈ జాబితాలో జూమ్‌ డెవలపర్స్‌ (రూ.310 కోట్ల రుణాలు), ఫస్ట్‌ లీజింగ్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా(రూ.143 కోట్లు), మోజర్‌ బేయర్‌ ఇండియా(రూ.122 కోట్లు) సూర్య వినాయక్‌ ఇండస్ట్రీస్‌(రూ.108 కోట్లు) ఉన్నాయి. 



You may be interested

స్పెన్సర్‌ రిటైల్‌లో వాటాల కొనుగోలు చేసిన పొరింజు

Tuesday 18th June 2019

పొరింజు వెలియత్‌కు చెందిన ఈక్యూ ఇండియా ఫండ్‌ నాలుగు లక్షల స్పెన్సర్స్‌ రిటైల్‌ షేర్లను షేరుకు రూ. 94.53 చొప్పున కొనుగోలు చేసింది. దీంతో పాటు పలు బల్క్‌డీల్స్‌ మార్కెట్లో జరిగాయి. వాటి వివరాలు... - సిల్కాన్‌ ట్రేడ్స్‌ ఎల్‌ఎల్‌పీ 96,000 ఫెలిక్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను షేరుకు రూ.17.01 చొప్పున కొనుగోలు చేసింది. - వైట్‌ ఐరిస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 1,93,11,255 అపోలో టైర్స్‌ షేర్లను నిఫ్టీలో షేరుకు రూ.199.77 చొప్పున కొనుగోలు

అజయ్‌ పిరమళ్‌ చేయి వేస్తే...,

Tuesday 18th June 2019

2013లో  10 శాతం వాటా కొనుగోలు  రూ.1,652 కోట్లకు కొన్న అజయ్‌ పిరమళ్‌  ఇప్పుడు దీనిని రూ.2,305 కోట్లకు విక్రయం  ఆరేళ్లలో రూ.  653 కోట్ల లాభం... 40 శాతం రాబడులు  ముంబై: అజయ్‌ పిరమల్‌కు... పెట్టుబడులపై భారీ లాభాలు ఆర్జిస్తారనే పేరు ఉంది. దీనిని ఆయన మరోసారి నిజం చేశారు. ఆరేళ్ల క్రితం (2013లో) ఆయన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో 9.96 శాతం వాటాను రూ.1,652 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ

Most from this category