News


‘ఎఫ్‌ జెడ్‌’ సిరీస్‌లో 2 నూతన బైక్‌లు

Tuesday 22nd January 2019
news_main1548130320.png-23719

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తన ఎఫ్‌ జెడ్‌ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను సోమవారం మార్కెట్లో విడుదలచేసింది. ఎఫ్‌ జెడ్‌–ఎఫ్‌1, ఎఫ్‌జెడ్‌ఎస్‌–ఎఫ్‌1 పేర్లతో ఈ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్‌).. 149 సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ల ధరల శ్రేణి రూ.95,000–రూ.97,000గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15 వెర్షన్‌ 3.0 తరువాత ఈఏడాదిలో ఏబీఎస్‌ సాంకేతికత కలిగిన ద్విచక్ర వాహనాలు ఇవేనని తెలియజేసింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్‌ మెటొఫుమీ షితార మాట్లాడుతూ.. ‘ఈ 2 నూతన బైక్‌ల విడుదల ద్వారా డీలక్స్‌ క్లాస్‌లో సంస్థ మార్కెట్‌ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.



You may be interested

పుంజుకోనున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ!

Tuesday 22nd January 2019

- 2019, 2020పై ఐఎంఎఫ్‌ నివేదిక - ద్రవ్యలోటుపై మాత్రం తీవ్ర ఆందోళన - తగ్గనున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు - అవుట్‌లుక్‌ను విడుదల చేసిన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌4’

Tuesday 22nd January 2019

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌4’ పేరుతో నూతన మోడల్‌ కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక పెట్రోల్‌, రెండు డీజిల్‌ వేరియంట్లలో ఈ మోడల్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్‌ వేరియంట్‌ కారు ధర రూ.63.5 లక్షలు.. డీజిల్‌ వేరియంట్ల ధరల శ్రేణి రూ.60.6 లక్షలు – రూ.65.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. చెన్నై ప్లాంట్‌లో వీటి ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ

Most from this category