STOCKS

News


షావోమీ గిన్నిస్ రికార్డు

Wednesday 21st November 2018
news_main1542775387.png-22241

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ ఒకే రోజున 500 రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. భారత గ్రామీణ ప్రాంతాల్లో 'మి స్టోర్స్స్‌’ పేరిట అక్టోబర్ 29న వీటిని ప్రారంభించామని షావోమీ గ్లోబల్ వైస్‌ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఉన్న పెద్ద స్థాయి "మి హోమ్‌" స్టోర్స్‌ తరహాలోనే ఇవి కూడా ఉంటాయని తెలియజేశారు. 2019 ఆఖరు నాటికి 5,000 పైచిలుకు 'మి స్టోర్స్‌'ను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు జైన్ చెప్పారు. దీనివల్ల 15,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ‘మి స్టోర్‌’ ఒకొక్కటీ సుమారు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 
పూర్తిగా ఆన్‌లైన్‌ అమ్మకాలతో ప్రారంభమైన షావోమీ.. భారత్‌లో అత్యంత వేగంగా ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతం 50 దాకా ఉన్న మి హోమ్‌ స్టోర్స్ సంఖ్యను 100కి పెచుకోవాలని సంస్థ భావిస్తోంది. కేవలం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌కే పరిమితం కాకుండా లగేజీ, పాదరక్షలు, దుస్తులు వంటి టెక్నాలజీయేతర విభాగాల్లోకి కూడా షావోమీ ప్రవేశిస్తోంది. 



You may be interested

జిర్కాన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు సెబీ ఓకే !

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: జిర్కాన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వస్తువుల ప్యాకేజింగ్‌కు సంబంధించిన లేబుల్‌ ప్రింటింగ్‌ వ్యాపారాన్ని ఈ కం‍పెనీ నిర్వహిస్తోంది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, డెహ్రాడూన్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు తీర్చుకోవడానికి, ఇతర

యూఎస్‌లో మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌

Wednesday 21st November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మిల్క్‌షేక్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ ఫుడ్‌ స్టార్టప్‌ ‘మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌’ యూఎస్‌లో అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో తొలి స్టోర్‌ను తెరిచింది. కెనడా, దుబాయి, సింగపూర్, ఆస్ట్రేలియా నుంచి ఫ్రాంచైజీల కోసం ఎంక్వైరీలు వస్తున్నాయని మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌షేక్స్‌ ఫౌండర్‌ రాహుల్‌ తిరుమలప్రగడ మంగళవారం చెప్పారు. ‘‘ఆయా దేశాల్లో మార్చికల్లా ఔట్‌లెట్లను తెరుస్తాం. హైదరాబాద్‌ సహా దక్షిణాదిన మొత్తం 80 స్టోర్లున్నాయి. 2019 చివరినాటికి దేశవ్యాప్తంగా 200

Most from this category