STOCKS

News


ఇల్లంతా ‘‘ఎంఐ’’ మయం..!

Friday 28th December 2018
Markets_main1545970874.png-23275

- నూతన విభాగాలపై షావోమీ కన్ను
- ఫోన్లు, టీవీలతో పాటు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు
- త్వరలో వాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూపిఫయర్లలోకి
- ప్రణాళికల రచనలో కంపెనీ ఉన్నత ఉద్యోగులు

న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్‌... హాల్లో ఎంఐ ఫ్రిజ్‌... కిచెన్‌లో ఎంఐ వాటర్‌ ప్యూరిఫయర్‌... బాల్కనీలో ఎంఐ వాషింగ్‌ మెషిన్‌... బెడ్‌ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థగా అవతరించనుంది. షావోమీ ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం ప్రస్తుతం ఇదే పనిలో ఉంది. భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశం ఉన్న ఏసీలు, వాషింగ్‌ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూరిఫయర్ల విభాగాల్లో ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి సారించినట్టు సమాచారం. అన్ని ఉత్పత్తులు కూడా ఇంటర్నెట్‌ ఆధారితంగా నియంత్రించేందుకు (ఐవోటీ) వీలుండే స్మార్ట్‌గానే ఉంటాయని, రిమోట్‌గా వీటిని నియంత్రించుకోవచ్చని కంపెనీ ఉద్యోగులు తెలిపారు.
వృద్ధి అవకాశాలు...
భారత మార్కెట్లో షావోమీ ఏటా 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా మరింత వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది కంపెనీ ఆలోచన. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ఈ ఒక్క విభాగమే శాశ్వతం కాదనుకుని అదనపు వృద్ధి అవకాశాలపై కంపెనీ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నిజానికి షావోమీ ఇప్పటికే భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్లు, టీవీలతోపాటు మరికొన్ని గ్యాడ్జెట్లను కూడా విక్రయిస్తోంది. స్మార్ట్‌ టెలివిజన్ల విభాగంలో వచ్చే ఏడాది మరిన్ని ఉత్పత్తులను తీసుకురానుంది. షావోమీ ప్రస్తుతం తన ఉత్పత్తులను తొలుత ఆన్‌లైన్‌లో విడుదల చేసి, తర్వాత ఎంఐ స్టోర్లలో అందుబాటులోకి తెస్తోంది. ఇకపై పెద్ద ఎలక్ట్రానిక్‌, మొబైల్‌ రిటైల్‌ స్టోర్లలోనూ తన ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని పరిశ్రమకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.
ఆఫ్‌లైన్లో విస్తరణ
షావోమీ దేశవ్యాప్తంగా కొత్తగా 500 పట్టణాల్లోకి వచ్చే ఏడాది తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉంది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని టాప్‌ 50 పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. షావోమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ స్మార్ట్‌ టెలివిజన్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ప్రధాన కంపెనీలైన శామ్‌సంగ్‌, సోనీ, ఎల్‌జీ ఉత్పత్తులతో పోలిస్తే 30-50 శాతం చౌక ధరలకే ఆఫర్‌ చేయడం ద్వారా వాటికి గట్టి సవాల్‌ విసిరింది. తొలుత ఆన్‌లైన్‌లో ఆరంభించిన విక్రయాలను తర్వాత ఎంఐ స్టోర్లకు విస్తరించింది. స్థానిక కంపెలతో తయారీ ఒప్పందాలను చేసుకుంది. ఇదే తరహాలో హోమ్‌ అప్లయన్సెస్‌ విభాగంలోనూ మరిని ఉత్పత్తులతో చొచ్చుకుపోవాలన్నది కంపెనీ వ్యూహం. ప్రధాన కంపెనీలకు దీటుగా ఫీచర్లు అన్నింటినీ ఇస్తూ, ధరల పరంగా చౌకగా అందుబాటులోకి తీసుకురావడం ఎంఐ విజయసూత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు త్వరలో ఎంఐ బ్రాండ్‌ నుంచి మరిన్ని ఇతర ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.



You may be interested

కట్టుతప్పిన ద్రవ్యలోటు

Friday 28th December 2018

2018-19 బడ్జెట్‌ లక్ష్యం రూ.6.24 లక్షల కోట్లు  నవంబర్‌ నాటికే రూ.7.16 లక్షల కోట్లకు చేరిక లక్ష్యానికన్నా 15 శాతం పెరుగుదల న్యూఢిల్లీ: భారత్‌ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కట్టుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమై మార్చి 2019తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నెలకు వచ్చేసరికే ద్రవ్యలోటు బడ్జెట్‌ నిర్దేశాలను దాటిపోయింది. బడ్జెట్‌ లక్ష్యంలో​ 115 శాతాన్ని తాకింది. వివరాల్లోకి వెళితే... - ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో

రూపాయి అప్‌

Friday 28th December 2018

డాలరు బలహీనత కారణంగా ఇతర ఆసియా కరెన్సీలు బలపడిన నేపథ్యంలో రూపాయి సైతం పెరిగింది. శుక్రవారం ముంబైలోని ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే‍్ఛంజ్‌ మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 26పైసలు పెరిగి 70.02 వద్దకు చేరింది. అమెరికా గవర్నమెంట్‌ షట్‌డవున్‌ ఫలితంగా పలు కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడింది. డాలరు ఇండెక్స్‌ క్రితం రోజు 0.13 శాతం తగ్గుదలతో 96.35 స్థాయికి పడిపోయింది. అలాగే ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధర

Most from this category