STOCKS

News


భారీ విస్తరణ ప్రణాళికలో షావోమీ

Thursday 25th April 2019
news_main1556153565.png-25333

న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షావోమీ భారీ విస్తరణ ప్రణాళికలో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరినాటికి తన రిటైల్‌ స్టోర్స్‌ సంఖ్యను 10,000కు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ స్టోర్స్‌ నుంచే 50 శాతం వ్యాపారం కొనసాగించేలా వ్యూహాలను సిద్ధంచేసినట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్, షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో 6,000 అవుట్‌లెట్లను కంపెనీ నిర్వహిస్తోంది. ‘మి హోమ్స్‌’, ‘మి ప్రిఫర్డ్‌ పార్ట్నర్‌’, ‘మి స్టోర్స్‌’ పేరిట మూడు ఫార్మాట్లలో ఈ స్టోర్లను కొనసాగిస్తోంది. తాజాగా బెంగళూరు, ముంబైలలో మి స్టూడియోస్‌ పేరుతో 400–600 ఎస్‌ఎఫ్‌టీ సగటు సైజ్‌ స్టోర్లను ప్రారంభించింది. ఇక రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం గతేడాది డిసెంబర్‌ నాటికి స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో షావోమీ 28.9 శాతం మార్కెట్‌ వాటాను        కలిగిఉంది. 

‘రెడ్‌మి వై3’@ రూ.9,999 
షావోమి తాజాగా ‘రెడ్‌మి వై3’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఏప్రిల్‌ 30 నుంచి కస్టమర్లకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ హ్యండ్‌సెట్‌ 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.9,999గా, 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.11,999గా తెలిపింది. ఇదే సమయంలో ‘రెడ్‌మీ 7’ ఆవిష్కరించింది. దీని ధర రూ.7,999 కాగా, ‘మి ఎల్‌ఈడీ స్మార్ట్‌ బల్బ్‌’ పేరుతో తన వెబ్‌ సైట్‌ ద్వారా  స్మార్ట్ బ‌ల్బుల ద్వారా ఆవిష్క‌రించింది.



You may be interested

హైదరాబాద్‌లో క్లెన్‌స్టా ప్లాంట్‌!

Thursday 25th April 2019

వాటర్‌లెస్‌ హెల్త్‌కేర్‌ ఉత్పత్తులకు ఆదరణ సంస్థ వ్యవస్థాపకుడు పునీత్‌ గుప్తా  హైదరాబాద్, సాక్షి బిజినెస్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో తమ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తామని పర్సనల్‌ హెల్త్‌కేర్‌ సంస్థ క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు పునీత్‌ గుప్తా చెప్పారు. దాదాపు రూ.35 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తామని, దీని ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు రెండు లక్షల బాటిళ్లని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. కంపెనీ తాజాగా మార్కెట్లోకి వాటర్‌లెస్‌

తక్కువ వడ్డీ దారిలో ఆర్‌బీఐ: ఫిచ్‌

Thursday 25th April 2019

ఆసియా పసిఫిక్‌ ప్రాంత సెంట్రల్‌ బ్యాంకుల్లో ప్రత్యేకమని వ్యాఖ్య   న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఫిచ్‌ పేర్కొంది. దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్‌బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఫైనాన్షియల్‌ పరిస్థితులు... ఆర్‌బీఐ

Most from this category