STOCKS

News


కూరగాయల ధరల మంట!

Wednesday 15th May 2019
news_main1557900347.png-25744

  • కూరగాయల ధరల మంట!
  •  ఏప్రిల్‌లో  ఏకంగా 40.65 శాతం పెరిగిన టోకు ధరలు
  • సూచీ మొత్తం చూస్తే, ద్రవ్యోల్బణం 3.07 శాతం
  • 2018 ఏప్రిల్‌లో 3.62 శాతం
  • ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు ఓకే

న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టోకున కూరగాయల బాస్కెట్‌ ధరలు ఏప్రిల్‌లో 40.65 శాతం (2018 ఏప్రిల్‌ ధరలతో పోల్చి) పెరిగాయి. అయితే మొత్తంగా  టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యో‍ల్బణంలోని అన్ని విభాగాలనూ కలిపి చూస్తే,  ఏప్రిల్‌లో 3.07 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్‌ ధర టోకును 2018 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2019 ఏప్రిల్‌లో 3.07 శాతం పెరిగిందన్నమాట. అయితే 2018 ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు (2017 ఏప్రిల్‌తో పోల్చి) 3.62 శాతంగా ఉంది. సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉండే తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గాయి. ఇంధనం ధర కూడా ఏప్రిల్‌లో పెద్దగా పెరగలేదు.  సూచీలో ఫుడ్‌ ఆర్టికల్స్‌ వాటా దాదాపు 20 శాతం. ‍ఒకవైపు ద్రవ్యో‍ల్బణం రేట్లు అదుపులో ఉండడం, మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత నేపథ్యంలో జూన్‌లో ఆర్‌బీఐ రెపో రేటు కోత మరోసారి ఉండవచ్చని అసోచామ్‌సహా పలు పారిశ్రామిక సంఘాలు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ పరిశోధనా నివేదికలు సూచిస్తున్నాయి. ఏప్రిల్‌ టోకు ధరల పరిస్థితిపై  మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలను చూస్తే...

- నెలల వారీగా చూస్తే, 2019 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 2.93 శాతం ఉంటే, మార్చిలో 3.18 శాతంగా ఉంది. 
- ఇక సూచీలోని ఆహార విభాగాన్ని చూస్తే, ధరల స్పీడ్‌ ఏప్రిల్‌లో ఏకంగా 7.37 శాతంగా ఉంది. అంతక్రితం నెల అంటే మార్చిలో ఈ స్పీడ్‌ కేవలం 5.68 శాతమే. ఈ విభాగంలో ఒకటైన  కూరగాయల ధరల పెరుగుదల దీనికి కారణం. 2018 డిసెంబర్‌లో ఆహార ద్రవ్యో‍ల్బణం అసలు పెరక్కపోగా -0.42 శాతం క్షీణిం‍చింది. అయితే అప్పటినుంచీ పెరుగుతూ వస్తోంది. ఇదే కూరగాయల రేట్లను చూస్తే,  2018 డిసెంబర్‌లో -19.29 శాతం క్షీణత ఉంటే, 2019 మార్చిలో 28.13 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో ఏకంగా 40.65 శాతం పెరిగింది. కాగా ఆలూ ధరల మాత్రం పెరగలేదు. 17.15 శాతం తగ్గాయి. ఉల్లిపాయలు (-3.43 శాతం), పండ్ల (-6.88 శాతం) ధరలు కూడా తాగ్గాయి.  
- ఇంధనం, విద్యుత్‌ విభాగంలో పెరుగుదల రేటు మార్చిలో 5.41 శాతం ఉంటే, ఏప్రిల్‌లో 3.84 శాతానికి తగ్గింది. డీజిల్‌ ధరల పెరుగుదల రేటు కూడా నెలవారీగా 7.33 శాతం నుంచి 3.24 శాతానికి తగ్గింది. పెట్రోల్‌ ధరలు 1.78 శాతం నుంచి 1.74 శాతానికి దిగివచ్చాయి. అయితే ఎల్‌పీజీ ధరల రేటు మాత్రం 0.94 శాతం నుంచి 11.48 శాతానికి చేరింది. 
- ఇక తయారీ రంగం విభాగాన్ని చూస్తే, రేటు 2.16 శాతం నుంచి 1.72 శాతానికి చేరింది.

రేటు కోతకు సంకేతాలు...
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 6 శాతం)ను మరింత తగ్గించడానికి అనుగుణమైన గణాంకాలు ప్రస్తుతం వస్తున్నాయని పారిశ్రామిక రంగం పేర్కొంటోంది. జూన్‌ 6న ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమీక్ష ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాలసీ రేటు నిర్ణయానికి ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. బుధవారం నాడు విడుదలైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం ఏప్రిల్‌లో 2.92 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యం 4 శాతం లోపే ఉండడం గమనార్హం. ఇక మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారింది.  మున్ముందు ఇదే రీతిలో ధరలు కొనసాగితే ఆర్‌బీఐ మరోదఫా రేటు రెపో రేటు తగ్గింపు ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. టోకు, రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం రేట్లు 4 శాతం దిగువనే ఉన్నందున వచ్చే నెల జరగనున్న పాలసీ సమీక్ష సందర్భంగా రేటు తగ్గింపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అసోచామ్‌ డిప్యూటీ సెక్రటరీ జనలర్‌ సుభాశ్‌ సన్యాల్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌-సెప్టెంబర్ మధ్య రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.9 శాతం నుంచి 3 శాతం మధ్య ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనా. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ఆర్‌బీఐ మరోపావుశాతం రేటు కోత అవసరం ఉందని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక (ఎకోవ్రాప్‌) అంచనావేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ రిసెర్చ్‌ డిఫ్యూజన్‌ ఇండెక్స్‌ కూడా ఇదే అంశాన్ని సూచిస్తోంది. అయితే వర్షపాత పరిస్థితులపై రేటు కోత ఆధారపడి ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ రిసెర్స్‌ ఇండెక్స్‌ సూచిస్తోంది. 



You may be interested

ఇండిగో సమ్మర్‌ ఆఫర్‌ సేల్‌

Wednesday 15th May 2019

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో... రూ.999కే టికెట్ అందిస్తోంది. ‘3-డే సమ్మర్‌ సేల్‌’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలపై ఆఫర్‌ వర్తిస్తుంది. ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-హైదరాబాద్, హైదరాబాద్-దుబాయ్, చెన్నై- కువైట్, ఢిల్లీ-కౌలాలంపూర్, బెంగళూరు-మాల్దీవ్‌ రూట్లలో ఆఫర్‌ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ అంశంపై సంస్థ

స్థిరంగా పసిడి

Wednesday 15th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 1 డాలరు నష్టపోయి 1,295.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాషింగ్టన్‌ - బీజింగ్‌ల మధ్య వాణిజ్య చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. అలాగే డాలరుతో పాటు పలు ప్రపంచ ఈ‍క్విటీ మార్కెట్లు రికవరి బాట పట్టాయి. ఈ సోమవారం ఒక్కరోజులోనే పసిడి 20డాలర్ల లాభపడటంతో

Most from this category