STOCKS

News


బోనస్‌కు విప్రో వాటాదారుల ఆమోదం

Monday 25th February 2019
news_main1551069012.png-24311

న్యూఢిల్లీ: బోనస్‌ ఇష్యూ ప్రతిపాదనకు, అధీకృత మూలధనం పెంపునకు మెజారిటీ వాటాదారులు ఆమోదం తెలిపినట్టు విప్రో తెలిపింది. వాటాదారుల వద్దనున్న ప్రతి మూడు షేర్లకు (ముఖ విలువ రూ.2) ఒక షేరును బోనస్‌గా ఇవ్వడానికి విప్రో బోర్డు జనవరిలో నిర్ణయించిన విషయం గమనార్హం. ఫిబ్రవరి 22 గడువు నాటికి అవసరమైన మెజారిటీ వాటాదారులు బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు విప్రో స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అధీకృత మూలధనం పెంపునకు 98.82 శాతం, బోనస్‌ షేర్ల జారీకి 99.81 శాతం మంది వాటాదారుల ఆమోదం లభించినట్టు వెల్లడించింది. బోనస్‌ షేర్ల జారీ ద్వారా కంపెనీ అధీకృత మూలధనం రూ.1,126.50 కోట్ల నుంచి రూ.2,526.50 కోట్లకు పెరగనుంది.You may be interested

నిఫ్టీ తక్షణ అవరోధం 10,850

Monday 25th February 2019

తక్షణ అవరోధం 36,100 కొద్దినెలలుగా ప్రపంచ ట్రెండ్‌కు భిన్నంగా దేశీయ సూచీలు కదులుతూ వస్తున్నాయి. ఇదేరీతిలో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ నెలల గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ మార్కెట్‌ మాత్రం రెండు శాతం శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ బ్రేకులు వేయడం, అమెరికా-చైనాల వాణిజ్య చర్చల పట్ల ఏ రోజుకారోజు ఇరు దేశాల అధ్యక్షులూ సానుకూల ప్రకటనలు చేయడం ప్రపంచ మార్కెట్ల ర్యాలీకి ఊతమివ్వగా, మరో

ఒడిదుడుకుల వారం

Monday 25th February 2019

గురువారం.. క్యూ3 జీడీపీ గణాంకాలు, జనవరి ద్రవ్యలోటు, ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ డేటా శుక్రవారం.. నికాయ్‌ తయారీ రంగ పీఎంఐ, ఆటో రంగ అమ్మకాల గణాంకాలు ఈవారంలోనే ఫిబ్రవరి ఎఫ్‌ ఎండ్‌ ఓ సిరీస్‌ ముగింపు భారత్–పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై ఇన్వెస్టర్ల దృష్టి భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందన్న ఎపిక్‌ రీసెర్చ్‌ ముంబై: స్థూల ఆర్థిక సమాచారం, వెంటాడుతున్న భారత్–పాక్‌ యుద్ధ భయాలు, వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య వాషింగ్టన్‌లో జరగనున్న చర్చలు ఈ వారం

Most from this category