STOCKS

News


ట్రంప్‌ ట్వీట్‌తో ఫార్మా ర్యాలీకి పగ్గాలు?

Tuesday 10th July 2018
news_main1531213695.png-18169

ఫైజర్‌ సహా ఇతర ఫార్మా కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మండిపడ్డారు. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఫార్మాషేర్లన్నీ నేలచూపులు చూస్తున్నాయి. పలు సంవత్సరాల మందగమనం అనంతరం ఇటీవలే ఫార్మా షేర్లలో ర్యాలీ ఆరంభమైంది. అయితే ట్రంప్‌ తాజా ట్వీట్‌ ఈ ర్యాలీకి చెక్‌ పెట్టవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ నేపథ్యంలో ఫైజర్‌, సన్‌ఫార్మా, లుపిన్‌, అరబిందో షేర్లు సుమారు ఒక శాతం వరకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎలాంటి కారణం లేకుండానే ఫైజర్‌ సహా ఫార్మా కంపెనీలు రేట్లు పెంచడంపై సిగ్గుపడాలని ట్రంప్‌ దుయ్యబట్టారు. పేదల అవసరాలను ఈ కంపెనీలు వాడుకుంటున్నాయన్నారు. ఇవే కంపెనీలు ఇతర దేశాల్లో మాత్రం సరసరమైన ధరలకు అమ్మకాలు జరుపుతున్నాయన్నారు. తాము ఈ అంశంపై ప్రతిస్పందించి తీరతామని హెచ్చరించారు. ఈ నెలారంభంలో వయగ్రా సహా 40 ఔషధాల రేట్లను ఫైజర్‌ పెంచడం జరిగింది. వెంటనే ఇతర ఫార్మా కంపెనీలు సైతం ఇదే బాట పట్టాయి. అయితే తమ పోర్టుఫోలియోలో కేవలం పది శాతం ఉత్పత్తుల ధరలను మాత్రమే మార్చామని, నిజానికి కొన్నింటి ధరలను తగ్గించడం కూడా జరిగిందని ఫైజర్‌ ప్రతినిధి వివరించారు. ఈ ధరలు రోగులపై ఎలాంటి ప్రభావం చూపవని, ఇవన్నీ రిబేటుపై లభిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోసోమవారం ఫైజర్‌ షేరు యూఎస్‌ మార్కెట్లో 0.13 శాతం లాభపడడం గమనార్హం. You may be interested

ఈ కంపెనీల నికరలాభం డబుల్‌...

Tuesday 10th July 2018

బ్రోకరేజ్‌ల బుల్లిష్‌ అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పది కంపెనీలు గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రెట్టింపు నికరలాభం నమోదు చేయవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. ఈ కంపెనీల షేర్లపై ఆయా బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్నాయి. వీటి వివరాలు.. కోటక్‌ ఈక్విటీస్‌... 1. అపోలో టైర్స్‌: నికరలాభం 173 శాతం పెరగవచ్చని అంచనా. నికర విక్రయాలు 21

మూడోరోజూ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Tuesday 10th July 2018

ముంబై:- వరుసగా మూడోరోజూ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు పటిష్టమైన ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగషేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచి మంగళవారం ఇంట్రాడేలో 2శాతానికి పైగా లాభపడింది. మధ్యాహ్నం గం.2:00 ని.లకు నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.36శాతం లాభపడి 2,854 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీలోని మొత్తం 12 షేర్లకు గానూ ఒక్క ఐడీబీఐ షేరు తప్ప.., మిగతా అన్ని షేర్లు అన్ని

Most from this category