News


జైడస్‌... హార్లిక్స్‌ కాకుండా కాంప్లాన్‌ను ఎందుకు ఎంచుకున్నది?

Thursday 25th October 2018
news_main1540446933.png-21475

అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్‌ వెల్‌నెస్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌తో కలసి హీంజ్‌ ఇండియాకు చెందిన కాంప్లాన్‌, పలు ఇతర ఉత్పాదనల హక్కులను రూ.4,595 కోట్లతో సొంతం చేసుకుంది. కాంప్లాన్‌ వార్షిక విక్రయాలకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించడం ద్వారా సొంతం చేసుకుంటోంది. కాంప్లాన్‌ న్యూట్రిషన్‌ డ్రింక్‌, గ్లూకాన్‌ డి, నైసిల్‌ ప్రిక్లీ హీట్‌ పౌడర్‌, సంప్రితి ప్రీమియం నెయ్యి జైడస్‌ పరం అవుతాయి. దేశంలో అతిపెద్ద హెల్త్‌ డ్రింక్‌ బ్రాండ్‌ హార్లిక్స్‌. ఇది జీఎస్‌కే కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు చెందినది. హార్లిక్స్‌ బ్రాండ్‌ను జీఎస్‌కే విక్రయానికి పెట్టింది. కాంప్లాన్‌ కంటే నాలుగు రెట్లు అధిక విక్రయాలు హార్లిక్స్‌ బ్రాండ్‌కు ఉన్నాయి. మరి హార్లిక్స్‌ కాకుండా కాంప్లాన్‌నే జైడస్‌ ఎందుకు ఎంచుకున్నది? అంటే... అందుకు పలు కారణాలను నిపుణులు పేర్కొంటున్నారు. 

కాంప్లాన్‌ కోసం జైడస్‌ పెడుతున్నది వార్షిక విక్రయాలకు నాలుగు రెట్లు మాత్రమే. ఇటీవల కాలంలో జరిగిన పలు డీల్స్‌తో పోలిస్తే ఇది తక్కువే. అంటే విలువ పరంగా కాంప్లాన్‌ను జైడస్‌ తక్కువకు సొంతం చేసుకుంటున్నట్టే. ఉదాహరణకు బహుళజాతి సంస్థ రెకిట్‌ బెంకిసర్‌... మూవ్‌, ఇచ్‌గార్డ్‌ తదితర బ్రాండ్లను పరాస్‌ ఫార్మాస్యూటికల్స్‌ నుంచి వార్షిక విక్రయాలకు ఎనిమిది రెట్లు అధికంగా పెట్టి కొనుగోలు చేసింది. ఇక కేశ్‌కింగ్‌ బ్రాండ్‌ను 5.5 రెట్లు అధికంగా వెచ్చించి ఇమామీ సొంతం చేసుకుంది. కానీ, హార్లిక్స్‌ విక్రయ ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంది. హార్లిక్స్‌ బ్రాండ్‌ విక్రయాలు ఏటా రూ.4,015 కోట్లుగా ఉన్నాయి. కానీ, అమ్మకం విలువ అంచనా 4 బిలియన్‌ డాలర్లు.. రూపాయిల్లో రూ.29,200 కోట్లు. హార్లిక్స్‌ వార్షిక అమ్మకాలకు 7.3 రెట్లు ఎక్కువ. 

తాజా కొనుగోలుతో తన చేతికి వచ్చే కాంప్లాన్‌, గ్లూకాన్‌ డి, నైసిల్‌ బ్రాండ్లను జైడస్‌ బాగానే మార్కెట్‌ చేసుకోగలదు. అందుకు కంపెనీ ప్రస్తుత మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ కలిసిరానుంది. కాంప్లాన్‌, గ్లూకాన్‌ డి, నైసిల్‌ అధిక భాగం విక్రయాలు ఫార్మసీ స్టోర్లలోనే జరుగుతున్నాయి. దీంతో వీటిని జైడస్‌ సులభంగా మార్కెట్‌ చేయగలదు. ప్రస్తుతం జైడస్‌ తన ఉత్పాదనలను దాదాపు అన్ని ఫార్మసీ స్టోర్లు సహా దేశవ్యాప్తంగా 4 లక్షల రిటైల్‌ అవుట్‌లెట్లకు చేరుస్తోంది. దీనికి అదనంగా హీంజ్‌ ఇండియా నుంచి 800 డిస్ట్రిబ్యూటర్లు, 20,000 హోల్‌సేలర్లు కూడా జైడస్‌ నెట్‌వర్క్‌ కిందకు రానున్నారు. ఇక కాంప్లాన్‌ ఇప్పటికే 8 లక్షల రిటైల్‌ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. దీంతో తన షుగర్‌ ఫ్రీ, న్యూట్రాలైట్‌ ఉత్పత్తులను జైడస్‌ వెల్‌నెస్‌ మరిన్ని స్టోర్లకు తీసుకెళ్లగలదు. ఇది రెండు విధాలుగా కంపెనీకి మేలు చేయనుంది. ఇక హీంజ్‌ ఇండియాతో పోలిస్తే... హార్లిక్స్‌ విక్రయాల మార్కెట్‌ నెట్‌వర్క్‌ జైడస్‌కు అంతగా కలసిరాకపోవడం మరో అంశం. కాంప్లాన్‌ అన్నది జైడస్‌ న్యూట్రిషన్‌ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. గ్లూకాన్‌ డి ఆ విభాగంలో లీడర్‌గా ఉంది. ఎక్కువగా ఆదరణ ఉన్న బ్రాండ్‌ కూడా. ఈ విభాగంలో చోటు కోసం కోకకోలా, పెప్సీకో తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. You may be interested

స్టాక్‌ ఇన్వెస్టర్లకు డివిడెండ్లు మంచి స్నేహితులు: బోగ్లే

Thursday 25th October 2018

డివిడెండ్లు అన్నవి సంపద సృష్టికి ఉపయోగపడతాయని, అవి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికి మంచి స్నేహితులని ప్రముఖ అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ వ్యాన్‌గార్డ్‌ వ్యవస్థాపకుడు జాన్‌ సి బోగ్లే అన్నారు. ముంబైలో మార్నింగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు సందర్భంగా వీడియో ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. డివిడెండ్లకు ఉన్న కాంపౌండింగ్‌ శక్తి అద్భుతమని బోగ్లే పేర్కొన్నారు. దీర్ఘకాలంలో కార్పొరేట్‌ ఆదాయాలు, డివిడెండ్‌ రాబడి స్టాక్‌ ధరలను ముందుకు నడిపిస్తాయని

అనలిస్టుల టాప్‌ ట్రేడింగ్‌ ఐడియాలు

Thursday 25th October 2018

స్వల్పకాలానికి ప్రముఖ అనలిస్టులు కొన్ని స్టాక్‌ సిఫార్సులు అందిస్తున్నారు. అశ్విన్‌గుజ్రాల్‌ రికమండేషన్లు: 1. హెచ్‌డీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1765. స్టాప్‌లాస్‌ రూ. 1730 2. బజాజ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2340. స్టాప్‌లాస్‌ రూ. 2295.  3. ఎంఅండ్‌ఎం ఫిన్‌సర్వ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 420. స్టాప్‌లాస్‌ రూ. 395. 4. బజాజ్‌ ఆటో: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 2380. స్టాప్‌లాస్‌ రూ. 2500. 5. అంబుజా సిమెంట్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 188. స్టాప్‌లాస్‌

Most from this category