News


ఓఎంసీలకు కష్టకాలం?!

Wednesday 2nd January 2019
news_main1546414073.png-23367

క్యు3లో నష్టాలకు అవకాశం
క్రూడాయిల్‌ ధరలు పతనం, రిఫైనింగ్‌ మార్జిన్లు క్షీణించడంతో డిసెంబర్‌ త్రైమాసికంలో చమురు మార్కెటింగ్‌ కంపెనీల(ఓఎంసీ) ఎర్నింగ్స్‌ దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ త్రైమాసికంలో సింగపూర్‌ గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎం) ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. డిసెంబర్‌లో జీఆర్‌ఎం బ్యారెల్‌కు 4.3 డాలర్లకు పతనమైంది. క్రూడాయిల్‌ ధరలు ఒక్క డిసెంబర్‌లోనే దాదాపు పది శాతం పతనమయ్యాయి. ఈ రెండిటి ప్రభావం ఓఎంసీల పద్దు పుస్తకాలను దెబ్బతీస్తుందని యాంటిక్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. క్రూడ్‌ ధరలు తగ్గితే ఇప్పటికే ఎక్కువ ధరల వద్ద కొన్న నిల్వలను ఓఎంసీలు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. ఇది వాటి లాభాలపై ప్రభావం చూపుతుంది. డిమాండ్‌ పేలవంగా ఉండడం, సరఫరా పెరగడంతో గత కొన్ని నెలలుగా క్రూడాయిల్‌ ధర క్షీణిస్తూ వస్తోంది. దీంతో ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌కు నష్టాలు వచ్చే అవకాశాలు పెరిగాయి. 
గుడ్డిలో మెల్ల
ఒక పక్క లాభాలపై నెగిటివ్‌ ప్రభావం ఉన్నప్పటికీ, క్రూడాయిల్‌ ధరల పతనం ఇంధన రిటైలర్ల గ్రాస్‌ మార్కెటింగ్‌ మార్జిన్లు పెరిగేందుకు దోహదం చేస్తోంది. ప్రతి లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌ విక్రయంపై ఓఎంసీలకు వచ్చే మొత్తాన్ని మదింపు చేసి గ్రాస్‌ మార్కెటింగ్‌ మార్జిన్లను లెక్కిస్తారు. ప్రస్తుతం పెట్రోలుపై జీఎంఎం లీటరుకు 3.6 రూపాయలు, డీజిల్‌పై లీటరుకు 3.2 రూపాయలు ఉంది. ఈ అధిక జీఎంఎం కంపెనీలను కొంత మేర ఆదుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి చమురు ధరల పెరుగుతున్న తరుణంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కంపెనీలపై కొంత భారం మోపింది. ఈ భారం లేకుండా ఉంటే మరింత జీఎంఎంకు అవకాశం ఉండేది.

 



You may be interested

అటో షేర్లకు అమ్మక గణాంకాల పోటు

Wednesday 2nd January 2019

7శాతం నష్టపోయిన ఐషర్‌ మోటర్స్‌ ఆటో షేర్లను డిసెంబర్‌ విక్రయ గణాంకాలు నష్టాల బాట పట్టించాయి. పరిశ్రమలో నగదు కొరత, స్థూల ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో డిసెంబరులో దేశీయ వాహన విక్రయాలు మందకొడిగా నమోదయ్యాయి. ఫలితంగా నేటి ఇంట్రాడే అటోరంగ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2.65శాతం నష్టపోయింది. అటో ఇండెక్స్‌ మధ్యాహ్నం

వాహన విక్రయాలు తగ్గాయి!

Wednesday 2nd January 2019

 డిసెంబరు అమ్మకాల్లో నెమ్మదించిన వృద్ధి - ఆకట్టుకోలేకపోయిన భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు - లిక్విడిటీ కొరత వంటి అంశాలే ప్రధాన కారణం! న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో నెమ్మదించాయి. సంవత్సరాంతపు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఎన్ని ప్రకటించినా... వాహనాల విక్రయాలు మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. జనవరిలో ధరలు కూడా పెరుగుతుండటం ఇక్కడ గమనార్హం. కాగా లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత వంటి ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల

Most from this category