STOCKS

News


రుచి సోయా అంటే ‘పతంజలి’కి ఎందుకంత ఆసక్తి?

Tuesday 25th December 2018
news_main1545761887.png-23226

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌... వంట నూనెల్లో అతిపెద్ద కంపెనీ అయిన రుచిసోయాను సొంతం చేసుకునేందుకు ఇప్పటికీ ఆసక్తిగానే ఉంది. అదానీ విల్‌మర్‌ బిడ్‌ గెలిచినప్పటికీ... దివాలా పరిష్కార ప్రక్రియను ముగించే విషయంలో తీవ్ర జాప్యాన్ని పేర్కొంటూ ఆ సంస్థ తన ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. బిడ్డింగ్‌లో అదానీ తర్వాత పతంజలి సంస్థే రెండో స్థానంలో ఉంది కనుక, రుచి సోయా పతంజలి పరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

రుచిసోయా కొనుగోలు విషయంలో అదానీ ఆఫర్‌కు అనుగుణంగా తన ఆఫర్‌ను మార్చేందుకు పతంజలి సంసిద్ధతను వ్యక్తం చేసింది. అదానీ విల్‌మర్‌ రూ.5,474 కోట్లను ఆఫర్‌ చేసింది. ఇందులో రూ.4,300 కోట్లను బ్యాంకులకు చెల్లించేందుకు ఆసక్తి చూపించింది. పతంజలి మాత్రం రూ.5,765 కోట్లతో ఆఫర్‌ ఇవ్వగా, ఇందులో రూ.4,065 కోట్లనే బ్యాంకులకు ఇవ్వజూపింది. దీంతో అదానీ ఆఫర్‌కే రుణదాతల ఆమోదం లభించింది. అదానీతో పోలిస్తే, రుచి సోయా కంపెనీ నిర్వహణకు పతంజలి ఎక్కువ ఇవ్వనున్నట్టు పేర్కొంది. బ్యాంకులు తమ రుణ బకాయిల వసూలు కోసమే దివాలా పరిష్కార ప్రక్రియను చేపట్టాయి గనుక సహజంగానే అదానీ బిడ్‌ గెలిచింది. 

 

అతిపెద్ద నూనెల కంపెనీ
రుచి సోయా 3.73 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద వంట నూనెల కంపెనీగా ఉంది. నూనె గింజల క్రషింగ్‌, మిల్లింగ్‌, రిఫైనింగ్‌, ప్యాకేజింగ్‌ కోసం 24 ప్లాంట్లు ఉన్నాయి. న్యూటెల్లా, మహాకోష్‌, సన్‌రిచ్‌, రుచి గోల్డ్‌, రుచిస్టార్‌ పేరుతో పేరొందిన బ్రాండ్లు కూడా ఉన్నాయి. విలువ ఆధారిత సోయా ఉత్పత్తుల ఎగుమతిలోనూ ఉంది. కంపెనీకి రూ.12,000 కోట్ల రుణాలు ఉన్నాయి. దీంతో తన వృద్ధి అవకాశాల కోసం పతంజలి సంస్థ రుచి సోయా పట్ల ఆసక్తిగా ఉంది. అదానీ విల్‌మర్‌ సైతం భారీగా ఆఫర్‌ చేయడానికి కారణం రుచి సోయా పాపులారిటీయే. నూనెల రిఫైనరీ, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ కోసం రుచి సోయాతో పతంజలికి ఒప్పందం కూడా ఉంది. తర్వాత తన ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం ఒప్పందం సైతం చేసుకుంది. 

 

ప్యాకేజ్డ్‌ వంట నూనెల మార్కెట్లో అదానీ విల్‌మర్‌కు 19 శాతం వాటా ఉంటే, రుచి సోయాకు 14 శాతం మార్కెట్‌ ఉంది. దేశంలో శాకాహార వంట నూనెల వినియోగం పెరుగుతోంది. ఏటా 3 శాతం  చొప్పున పెరుగుతూ 2030 నాటికి 34 మిలియన్‌ టన్నులకు వినియోగం చేరుతుందని రాబోబ్యాంకు అంచనా. దీంతో ఎఫ్‌ఎంసీజీలో భారీగా వృద్ధి అవకాశాలపై కన్నేసిన పతంజలి ఆయుర్వేద్‌కు రుచి సోయా ఆశాకిరణంగా కనిపిస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ పతంజలి టర్నోవర్‌ రూ.10,000 కోట్లుగానే ఉంది. టర్నోవర్‌ను ఐదేళ్లలో రూ.25,000 కోట్లకు తీసుకెళ్లాలన్నది రామ్‌దేవ్‌ ఆశయం. అందుకే కొనుగోలు అవకాశాలపై పతంజలి కన్నేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. You may be interested

జీడీపీ కంటే వృద్ధి చెందుతున్న స్టాక్స్‌ 

Tuesday 25th December 2018

దేశ జీడీపికి, స్టాక్‌ మార్కెట్‌కు మధ్య పరస్పర సంబంధం ఉందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అందుకే జీడీపీలో భాగమైన రంగాలు, రాబడులకు భరోసానిచ్చే వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వివేకం. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీని మించి మెరుగైన పనితీరు చూపించిన స్టాక్స్‌పై ఓ సంస్థ అధ్యయనం చేసింది. రూ.500 కోట్ల మార్కెట్‌ క్యాప్‌పైన గల 875 కంపెనీలను పరిశీలించింది. నిర్వహణ లాభం, ఈపీఎస్‌ వృద్ధి జీడీపీ కంటే ఎక్కువగా

వచ్చే ఏడాదికి ఎస్‌ఎంసీ గ్లోబల్‌ 10 సిఫార్సులు

Tuesday 25th December 2018

అధిక క్రూడ్‌ ధరలు, విదేశీ ఇన్వస్టర్ల అమ్మకాలతో ఈ ఏడాది  సతమతమైన మార్కెట్‌ వచ్చే ఏడాది మెరుగైన రాబడుల్ని ఇవ్వవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనావేసింది.  అయితే ఇటీవల క్రూడ్‌ ధర దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టడం సానుకూలమయ్యింది.  ఈ ఏడాదిలో ఇతర వర్థమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే మనదేశీయ మార్కెట్‌ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఆర్థిక వృద్ధి మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు, పలు దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకుల

Most from this category