STOCKS

News


వర్ల్‌పూల్‌ ఇండియా లాభం 23 శాతం అప్‌

Friday 10th August 2018
news_main1533897118.png-19136

న్యూఢిల్లీ: గృహోపకరణాలు తయారు చేసే వర్ల్‌పూల్‌ ఇండియా కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 23 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.133 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.164 కోట్లకు పెరిగిందని వర్ల్‌పూల్‌ ఇండియా తెలిపింది. గత ఏడాది జీఎస్‌టీ అమలుపై అనిశ్చితి కారణంగా గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈ లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సునీల్‌ డిసౌజా తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1,640 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.1,687 కోట్లకు పెరిగిందని తెలిపారు.. ఈ క్యూ1లో కమోడిటీ ధరలు పెరగడం, కరెన్సీ ఒడిదుడుకులు వంటి సమస్యలు ఎదుర్కొన్నామని తెలిపారు.  టీవీలు, ఫ్రిజ్‌లు, తదితర కొన్ని వస్తువులపై జీఎస్‌టీ రేట్లను తగ్గించినందున రానున్న క్వార్టర్లలో అమ్మకాలు పుంజుకుంటాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండడం ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. 


ఆర్థిక ఫలితాల నేపథ్యంలో వర్ల్‌పూల్‌ ఇండియా షేర్‌ 0.4 శాతం నష్టంతో రూ.1,730 వద్ద ముగిసింది. 


 



You may be interested

ఫార్మా ఎగుమతులు అప్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు మళ్లీ గాడినపడ్డాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి విదేశాలకు ఎగుమతైన ఫార్మా ఎగుమతులు 3 శాతం వృద్ధి రేటును నమోదుచేశాయి. గతేడాదిలో 17.3 బిలియన్‌ డాలర్లు (రూ.1,18,784 కోట్లు) విలువైన ఔషధ ఎగుమతులు జరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారంలో వెల్లడయింది. 2016-17 కాలంలో 16.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగగా, అంతకుముందు ఏడాదిలో 16.9 బిలియన్‌ డాలర్ల మేర ఎక్స్‌పోర్ట్స్‌ జరిగినట్లు

మణప్పురం ఫైనాన్స్‌ లాభం రూ.200 కోట్లు

Friday 10th August 2018

న్యూఢిల్లీ: మణప్పురం ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.200 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని, 21 శాతం వృద్ధి సాధించామని మణప్పురం ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.856 కోట్ల నుంచి రూ.947 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 55 పైసల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఈ

Most from this category