STOCKS

News


భారత్‌లోనే పేమెంట్స్ డేటా స్టోరేజి: వాట్సాప్‌

Wednesday 10th October 2018
news_main1539148279.png-20999

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపుల సంబంధిత డేటాను భారత్‌లోనే భద్రపర్చేలా (డేటా లోకలైజేషన్‌) తగు వ్యవస్థను రూపొందించుకున్నట్లు మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా పది లక్షల మందితో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందరికీ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్‌నకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 కోట్ల మంది యూజర్లు ఉండగా అందులో 20 కోట్ల మంది యూజర్లు భారత్‌లోనే ఉన్నారు. చెల్లింపు సేవలు అందించే సంస్థలన్నీ తత్సంబంధిత డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ ఆదేశించిన రిజర్వ్ బ్యాంక్ ఇందుకోసం అక్టోబర్ 15 దాకా గడువునిచ్చింది. దీనికి అనుగుణంగానే వాట్సాప్ తాజా ప్రకటన విడుదల చేసింది. డేటా లోకలైజేషన్‌పై ఆర్‌బీఐ ఆదేశాలపై పరిశ్రమలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పేటీఎం, ఫోన్‌పే వంటి దేశీ పేమెంట్ సంస్థలు దీన్ని స్వాగతించగా.. గూగుల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు.. డేటా స్వేచ్ఛకు అడ్డంకులు ఉండరాదని అభిప్రాయపడ్డాయి. ఇంకాస్త గడువు ఇవ్వాలంటూ కోరాయి. 



You may be interested

గూగుల్ ప్లస్‌కు గుడ్‌బై!!

Wednesday 10th October 2018

 వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్‌కి చెందిన సోషల్ మీడియా సైట్ గూగుల్‌ ప్లస్ మూతపడనుంది. సాఫ్ట్‌వేర్‌ పరమైన సాంకేతిక లోపాలతో యూజర్ల డేటా ఇతరుల చేతికి చేరే అవకాశాలుండటమే ఇందుకు కారణం. ఒక బగ్ మూలంగా 5,00,000 మంది యూజర్ల ప్రైవేట్ డేటా బయటి డెవలపర్లకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‍అయితే, ఏ డెవలపర్‌కు కూడా ఈ బగ్ గురించి గానీ,

భారత్‌కు మూడీస్‌ ‘క్రెడిట్‌ నెగటివ్‌’!

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల కోత ప్రభుత్వ ఆదాయాలకు గండి కొడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్‌ నెగటివ్‌’ అని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- వ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 3.3 శాతంగా ఉండాలన్న కేంద్ర బడ్జెట్‌ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, ఇది 3.4 శాతానికి పెరిగే

Most from this category