ఎంఅండ్ఎం షేరును ఏం చేద్దాం?
By D Sayee Pramodh

డిసెంబర్ త్రైమాసిక ఫలితాల అనంతరం ఎంఅండ్ఎం షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల ధృక్పథం ఇలా ఉంది...
1. డాయిష్ బ్యాంకు: కొనొచ్చు రేటింగ్. టార్గెట్ ధరను రూ. 850 నుంచి రూ. 815కు తగ్గించింది. రాబోయే మూడు సంవత్సరాలకు ఎబిటా అంచనాలను వరుసగా 8, 7, 4 శాతానికి తగ్గించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ అంచనాను మాత్రం 12 శాతం పెంచింది.
2. జేపీ మోర్గాన్: ఓవర్‌వెయిట్ రేటింగ్. టార్గెట్ రూ. 900. ఆటో మార్జిన్ల బలహీనతతో ఎర్నింగ్స్ అంచనాలను అందుకోలేకపోయాయి. ట్రాక్టర్ విక్రయాల్లో వృద్ధి మందగిస్తోంది. వచ్చే ఏడాది ట్రాక్టర్ వృద్ధి 9 శాతం లోపునకు పరిమితం కావచ్చు.
3. బీఎన్పీ పారిబా: కొనొచ్చు రేటింగ్. టార్గెట్ రూ. 890. ఇప్పటికీ తమ సైక్లిక్ పోర్టుఫోలియోలో ఎంచుకోదగిన స్టాకని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోర్ ఆటో బిజినెస్ వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు పేర్కొంది.
4. క్రెడిట్‌సూసీ: అవుట్‌పెర్ఫామ్ రేటింగ్. టార్గెట్ ధరను రూ. 1020 నుంచి రూ. 890కి తగ్గించింది. వృద్ధి అంచనాను సైతం 9 నుంచి 5 శాతానికి కోతవేసింది. అయితే ఇటీవల కరెక్షన్ అనంతరం వాల్యూషన్లు మాత్రం ఆకర్షణీయంగా ఉన్నట్లు తెలిపింది.
You may be interested
వేలానికి 23చమురు బ్లాక్‌లు
Monday 11th February 2019ఓఏఎల్‌పీ మూడో విడత ప్రారంభం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడుల అంచనా బిడ్డింగ్‌కు ఏప్రిల్ 10 గడువు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి గ్రేటర్ నోయిడా: ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద మూడో విడతలో కేంద్రం 23 చమురు, గ్యాస్, సీబీఎం బ్లాక్‌ల వేలం వేస్తోంది. దీనితో ఈ రంగంలోకి 600-700 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రావొచ్చని భావిస్తోంది. ఆదివారమిక్కడ పెట్రోటెక్ 2019 సదస్సులో ఓఏఎల్‌పీ మూడో రౌండును
మరో రూ.27,380 కోట్లు ఇవ్వండి
Monday 11th February 2019ఆర్బీఐని కోరిన కేంద్రం న్యూఢిల్లీ: రిస్కులు, రిజర్వుల పేరిట గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తన వద్ద అట్టే పెట్టుకున్న రూ. 27,380 కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్‌ను (ఆర్బీఐ) కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. 2016-17లో ఆర్బీఐ రూ. 13,190 కోట్లు, 2017-18లో రూ. 14,190 కోట్లు రిస్కులు, రిజర్వుల కింద ఆర్బీఐ పక్కన పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ నిధులను