News


మధ్యంతర బడ్జెట్లో ఏం ఆశించొచ్చు?

Tuesday 22nd January 2019
news_main1548138629.png-23726

వచ్చే నెల 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ఇలాంటి మధ్యంతర బడ్జెట్లో పెద్దపెద్ద నిర్ణయాలుండవు. కానీ ఈదఫా పాత సాంప్రదాయాన్ని బద్దలుకొడతామని, మధ్యంతర బడ్జెట్లో పెద్ద నిర్ణయాలనే ప్రకటిస్తామని జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్లో మార్కెట్‌ ఏం ఆశిస్తుందన్న విషయమై బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...
-  ఐడీబీఐ క్యాపిటల్‌: ట్రేడింగ్‌పై ఎస్‌టీటీ ఎత్తివేయడం లేదా కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు, లేదా డీడీటీ తగ్గింపు మార్కెట్‌కు సానుకూలంగా పరిణమిస్తుంది. ఈ మూడూ కలిసి వస్తే ఇంకా మంచింది. ఎన్నికల వేళ కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలుండవచ్చు.
- జిరోధా: ప్రజాకర్షక బడ్జెట్‌ రావచ్చు. రైతు రుణమాఫీ, ఐటీ శ్లాబుల సరళీకరణ లాంటి పాపులర్‌ చర్యలకు అవకాశం. ఎస్‌టీటీ తగ్గింపు లేదా తొలగింపు కోసం చాలాఏళ్లుగా డిమాండ్‌ ఉంది. ఇదే జరిగితే మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తాయి. ఎస్‌టీటీ కారణంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు, చిన్న ట్రేడర్లకు ఇబ్బంది కలుగుతోంది. దీన్ని తొలగిస్తే మార్కెట్‌పై దీర్ఘకాలిక పాజిటివ్‌ ప్రభావం ఉంటుంది. కొత్తగా మరిన్ని పెట్టుబడులుమార్కెట్లోకి వస్తాయి. 
- స్మాల్‌కేస్‌ టెక్నాలజీస్‌: 80సీ కింద మరిన్ని ఫండ్స్‌ను అనుమతించాలి. ముఖ్యంగా లార్జ్‌క్యాప్‌ ఈటీఎఫ్‌ లాంటి వాటిలో పెట్టుబడులను ఈ సెక‌్షన్‌ కిందకు తీసుకురావాలి. ఈటీఎఫ్‌ ఫండ్స్‌కు ఈ వెసులుబాటు ఇస్తే మరింత మంది ఇన్వెస్టర్లు ముందుకు వస్తారు. 
- కార్వీ: 80సీ కింద ఇస్తున్న మినహాయింపును రెట్టింపు చేయాలి. సీనియర్‌ సిటిజన్లకు ఉపయుక్తంగా పథకాలు ఉండొచ్చు. ఎస్‌టీటీని ఎత్తివేసే అవకాశాలున్నాయి. అన్ని వస్తువులను ఒకే జీఎస్‌టీ శ్లాబు కిందకు తీసుకువచ్చే ప్రయత్నం జరగవచ్చు. యూలిప్స్‌పై పన్నులుంటాయి. హెల్త్‌కేర్‌ కోసం చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌పై ఎక్కువ ఫోకస్‌ ఉండే అవకాశం ఉంది. You may be interested

‍కళ తప్పిన మెటల్‌ షేర్లు

Tuesday 22nd January 2019

మార్కెట్‌ పతనంతో భాగంగా మెటల్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్ల క్షీణత దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 2.50శాతానికిపైగా నష్టపోయింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,945.80) ధరతో పోలిస్తే 2.50శాతం క్షీణతో 2,868.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 5.50శాతం క్షీణించింది. అలాగే

3వారాల కనిష్టం వద్ద పసిడి

Tuesday 22nd January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 3వారాల కనిష్టానికి పతనమైంది. డాలర్‌ ఇండెక్స్‌ రెండువారాల గరిష్టానికి ఎగబాకడం ఇందుకు కారణమైంది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర ఉదయం ట్రేడింగ్‌లో 5.65 డాలర్ల నష్టపోయి 1,277 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రిటన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం యూరో ఆర్థిక వృద్ధిపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలకు, యూరో బలహీనత డాలర్‌కు డిమాండ్‌ బలాన్నిచ్చింది. ఫలితంగా డాలర్‌కు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే పసిడి ధర

Most from this category