News


ఫ్లిప్‌కార్ట్‌ కోసం వాల్‌మార్ట్‌ రూ.7,439 కోట్ల పన్ను చెల్లింపు

Monday 17th September 2018
news_main1537158902.png-20305

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాల్‌ మార్ట్‌ దేశీయ ఈ కామర్స్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు కోసం రూ.7,439 కోట్ల పన్నును చెల్లించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు 10 మంది నుంచి వాటాల కొనుగోలు కోసం ఈ మేరకు చెల్లించింది. ఇంకా 34 మంది నుంచి పన్నులను మినహాయించలేదు. ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్‌ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆ సంస్థకు, వాల్‌మార్ట్‌కు మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో మొత్తం 44 మంది వాటాదారులు ఉన్నారు. ఇందులో సాఫ్ట్‌బ్యాంకు, నాస్పర్స్‌, వెంచర్‌ ఫండ్‌ అయిన అస్సెల్‌పార్ట్‌నర్స్‌, ఈబే తదితరులు తమ వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించారు. పన్నును జమ చేసేందుకు చివరితేదీ సెప్టెబర్‌ 7కాగా, ఆఖరు రోజున రూ.7,439 కోట్ల విత్‌హోల్డింగ్స్‌ పన్నును వాల్‌మార్ట్‌ ఆదాయపన్ను శాఖకు జమ చేసింది. ‘‘ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు కలిగిన 44 మంది వాల్‌మార్ట్‌కు విక్రయించగా, కేవలం పది మందికి సంబంధించే వాల్‌మార్ట్‌ పన్నులు జమ చేసింది. వాటాదారుల నుంచి పన్నును మినహాయించే విషయంలో పాటించిన విధానాన్ని మేం ప్రశ్నించాం. ప్రతీ కేసుకు సంబంధించి వివరణ కోరాం’’అని ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా, చట్టబద్ధమైన బాధ్యతలను సీరియస్‌గా తీసుకుంటామని వాల్‌మార్ట్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడుల నేపథ్యంలో ట్యాక్స్‌ అధికారుల సూచనలకు అనుగుణంగా విత్‌హోల్డింగ్‌ పన్ను నిబంధనలను పూర్తి చేశాం. అధికారుల విచారణకు తగిన విధంగా స్పందిస్తాం’’ అని ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. చిన్న ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపుల విషయంలో విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌ నిబంధన కింద వాల్‌మార్ట్‌ పన్నును మినహాయించకపోయి ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. 



You may be interested

దేశీయ పరిశ్రమపైనా...అమెరికా సుంకాల ప్రభావం

Monday 17th September 2018

న్యూఢిల్లీ: అల్యూమినియం, స్టీల్‌పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం మన దేశ పరిశ్రమపైనా ప్రభావం చూపిస్తుందని అసోచామ్‌ తన నివేదికలో పేర్కొంది. స్టీల్‌ దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం మేర పన్నును ఈ ఏడాది మే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే, కచ్చితంగా ఎంత మేర ప్రభావం పడుతుందన్న అంచనా వేయడం కష్టమని, భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో

సూచీలకు మించి రాబడులు

Monday 17th September 2018

ఎడెల్వీజ్‌ లార్జ్‌క్యాప్‌ అన్ని కాలాల్లోనూ సూచీలకు తగ్గకుండా రాబడులను అందించడంలో ఎడెల్వీజ్‌ లార్జ్‌క్యాప్‌ పథకం పనితీరు గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గడిచిన ఏడాది కాలంలో 17 శాతం రాబడులను అందించి లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఉత్తమ పథకంగా నిలిచింది. లార్జ్‌క్యాప్‌ కారణంగా మార్కెట్లు ర్యాలీ చేయగా, ఇదే కాలంలో పోటీ పథకాల్లో రాబడులు ఒక అంకె వరకే ఉండడం గమనార్హం. బెంచ్‌మార్క్‌ నిఫ్టీ50తో పోలిస్తే రాబడుల్లో ముందు నిలిచింది. ఈ పథకం 2009లో

Most from this category