STOCKS

News


ఫ్లిప్‌కార్ట్‌లో వాటా పెంచుకున్న వాల్‌మార్ట్‌

Thursday 22nd November 2018
news_main1542864187.png-22293

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ తన వాటాను 77 శాతం నుంచి 81.3 శాతానికి పెంచుకుంది. 16 బిలియన్‌ డాలర్లతో ఈ ఏడాది మేలో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, 2 బిలియన్‌ డాలర్ల మేర ఈక్విటీ సమకూర్చడం ద్వారా సంస్థలో తన వాటా మరో 4.3 శాతం పెరుగుతుందని అప్పట్లోనే వాల్‌మార్ట్‌ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఇద్దరు వ్యవస్థాపకుల్లో సచిన్‌ బన్సల్‌ తన వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించి బయటకు వెళ్లిపోగా, మరో వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ మాత్రం సంస్థతోనే కొనసాగాలని ఆ నాడు నిర్ణయించుకున్నారు. ఇటీవలే తీవ్రమైన దుష్ప్రవర్తన ఆరోపణలతో గ్రూపు సీఈవో పదవికి ఆయన చేసిన రాజీనామాను వాల్‌మార్ట్‌ ఆమోదించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో టెన్సెంట్‌కు 5.37 శాతం, టైగర్‌ గ్లోబల్‌కు 4.77 శాతం, బిన్సీ బన్సల్‌కు 4.2 శాతం, మైక్రోసాఫ్ట్‌కు 1.53 శాతం, యాక్సెల్‌కు 1.38 శాతం, ఐకానిక్‌ క్యాపిటల్‌కు 0.98 శాతం, టెమసెక్‌కు 0.29 శాతం, యూబీఎస్‌కు 0.19 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా, ఫ్లిప్‌కార్ట్‌లోకి కొత్త ఇన్వెస్టర్లను తీసుకొచ్చే విషయమై చర్చలు జరుపుతున్నట్టు వాల్‌మార్ట్‌ ప్రకటించింది. గూగుల్‌, ఇంటెల్‌, ప్రస్తుత ఇన్వెస్టర్‌ మైక్రోసాఫ్ట్‌తోనూ నిధుల సమీకరణపై చర్చలు జరుపుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.  


 



You may be interested

బలహీనత దిశగా ప్రపంచ వృద్ధి!

Thursday 22nd November 2018

పారిస్‌: ప్రపంచ ఆర్థిక వృద్ధి ‘బలహీనత’ దిశగా పయనిస్తోందని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్ల వ్యవస్థ దిశగా పయనం వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని మందగమనంలోకి లాగుతున్నాయని పేర్కొంది. అయితే తక్షణం భారీగా పతనమయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని పేర్కొంటూనే... వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక అవుట్‌లుక్‌కు తగ్గిం‍చింది. ఓఈసీడీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ లారెన్స్‌

2019లో ఫార్మా పనితీరు భేష్‌!

Thursday 22nd November 2018

న్యూఢిల్లీ: గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పేలవమైన పనితీరు చూపించిన ఫార్మా రంగం ఈ ఏడాది 20 శాతం రాబడులనిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు చూపించిన రంగాల్లో ఇది కూడా ఒకటి. ఇక ముందూ ఫార్మా మంచి పనితీరు చూపిస్తుందన్న అంచనాను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫార్మా కంపెనీల షేర్ల ర్యాలీకి ప్రధానంగా తోడ్పడినది డాలర్‌తో రూపాయి 15 శాతం మేర విలువను కోల్పోవడం.

Most from this category