STOCKS

News


చలో విదేశీ... చాలా ఈజీ!!

Thursday 16th May 2019
news_main1557993251.png-25774

  • అంతర్జాతీయ సంస్థల రాకతో మారిన చిత్రం
  • చిన్న సంస్థలూ విదేశాల్లో విక్రయించొచ్చు
  •  తేలిగ్గా ఉత్పత్తులను చేరవేసే అవకాశం
  •  వాల్‌మార్ట్‌, అమెజాన్‌ ప్రత్యేక కార్యక్రమాలు

న్యూఢిల్లీ: ముంబైకి చెందిన ఇండోకౌంట్‌ ఇండస్ట్రీస్‌ మొదట్లో చాలా చిన్న కంపెనీ. కానీ పదేళ్ల కిందట వాల్‌మార్ట్‌ హోమ్‌ బ్రాండ్‌ కెనోపీతో ఒప్పందం కుదుర్చుకోవటం ఈ సంస్థకు అనూహ్యంగా కలిసి వచ్చింది. బెడ్‌షీట్లు, ఫ్యాషన్‌ బెడ్డింగ్‌ ఉత్పత్తులు విక్రయించే ఈ సంస్థ... దేశీ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావటమే కాక... ప్రస్తుతం అమెరికా, యూరప్‌ మార్కెట్లకు హోమ్‌ టెక్స్‌టైల్స్‌ సరఫరాలో ప్రముఖ సంస్థగా ఎదిగింది. 49 దేశాలకు విస్తరించడానికి వాల్‌మార్ట్‌ చేయూతే కారణమని ఇండోకౌంట్‌ చెబుతుంటుంది. 
పానిపట్‌కు చెందిన కపూర్‌ ఇండస్ట్రీస్‌దీ ఇలాంటి కథే. 2006లో వాల్‌మార్ట్‌తో దీనికి వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. దీనిపై ఆ సంస్థ డైరెక్టర్‌ ఆశిష్‌కపూర్‌ మాట్లాడుతూ... ‘‘2015లో 12 లక్షల టవల్స్‌ తయారు చేయగా, 2017లో 24 లక్షల టవల్స్‌ను ఉత్పత్తి చేశాం. ఏటా 33 శాతానికి తగ్గకుండా మూడేళ్లలో నూరు శాతం వ్యాపార వృద్ధిని సాధించాలన్నది మా లక్ష్యం’’ అని చెప్పారు. ఈ సంస్థ 2017లో 125 మిలియన్‌ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. ఇవేకాదు!! అంతర్జాతీయ దిగ్గజాలు తెచ్చిన కొత్త అవకాశాలతో ఇండోకౌంట్‌, కపూర్‌ ఇండస్ట్రీస్‌ లాంటి ఎన్నో భారతీయ తయారీ సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి.
వాల్‌మార్ట్‌కు పెద్ద సోర్సింగ్‌ కేంద్రం
దేశీయంగా ఉత్పత్తులు సమీకరించడానికి వాల్‌మార్ట్‌ బెంగళూరులో అతిపెద్ద సోర్సింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంది. భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఇక్కడ సమీకరించి అంతర్జాతీయ మార్కెట్లకు పంపిస్తోంది. టెక్స్‌టైల్స్‌, దుస్తులు, ఫార్మా, హ్యాండిక్రాఫ్ట్స్‌ను ఇక్కడి నుంచి 14 అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేస్తోంది. ‘‘వాల్‌మార్ట్‌కు ఇపుడు భారత్‌ కీలకమైన ఉత్పత్తుల సమీకరణ మార్కెట్‌. బెస్ట్‌ప్రైస్‌లో విక్రయాల్లో 95 శాతానికి పైగా స్థానిక కంపెనీలు, ఎస్‌ఎంఈలు, మహిళా పారిశ్రామికవేత్తల నుంచే సమీకరిస్తున్నాం’’ అని వాల్‌మార్ట్‌ గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ మారిలీమెకిన్స్‌ చెప్పారు.
అమెజాన్‌ సైతం...
వాల్‌మార్ట్‌ తరహాలో అమెజాన్‌ కూడా అంతర్జాతీయ అమ్మకాల కార్యక్రమంతో (గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రోగ్రామ్‌) మేకిన్‌ ఇండియాను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సరోజ్‌... అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లర్‌గా నమోదు చేసుకుని కాపర్‌ వస్తువులను విక్రయిస్తున్నాడు. నెలకు రూ.2,000 ఆదాయంతో మొదలెట్టిన సరోజ్‌... కస్టమర్ల అభిప్రాయాలు, సూచనలతో తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు తెచ్చాడు. ఇపుడు ఏడాదికి రూ.2 కోట్ల టర్నోవర్‌ నమోదు చేస్తున్నాడు. ‘‘గ్లోబల్‌ సెల్లింగ్‌ కార్యక్రమం కింద భారత్‌ నుంచి 50,000 మంది విక్రయదారులు మా నెట్‌వర్క్‌లో ఉన్నారు. వీరిలో 80 శాతం మంది పట్టణాలు, పల్లెల వారే. భారత్‌లో తయారీదారులు నాణ్యమైన ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. కోట్లాది కస్టమర్లను అనుసంధానిస్తూ మరింత మంది ఎగుమతిదారులను ఆన్‌లైన్‌లోకి తేవటమే గ్లోబల్‌ సెల్లింగ్‌ కార్యక్రమం ఉద్దేశం’’ అని అమెజాన్‌ ఇండియా గ్లోబల్‌ సెల్లింగ్‌ కార్యక్రమం అధిపతి అభిజిత్‌కమ్రా చెప్పారు. You may be interested

భారత్‌కు చైనా పెట్టుబడులు ఖాయం

Thursday 16th May 2019

వాణిజ్య యుద్ధాల ప్రభావంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో చైనా పెట్టుబడులు భారత్‌ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సమావేశమవుతారన్న వార్తల నేపథ్యంలో మహీం‍ద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "ఒకవేళ వివాదాస్పద అంశాలు పరిష్కారమైనప్పటికీ .. అమెరికాకు భారీగా ఎగుమతులు

రైట్స్‌లో 15 శాతం వాటా విక్రయం !

Thursday 16th May 2019

ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానానికి మొగ్గు రూ.700 కోట్లు సమీకరిస్తుందని అంచనా న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన రైట్స్‌ కంపెనీలో 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వాటా షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.700 కోట్లు రాగలవని అంచనా. ఈ ఓఎఫ్‌ఎస్‌కు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌  అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఇటీవలే ఆసక్తి గల సంస్థల

Most from this category