STOCKS

News


ఫోక్స్‌వ్యాగన్‌పై రూ.500 కోట్ల జరిమానా

Friday 8th March 2019
Markets_main1552025041.png-24487

న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) రూ.500 కోట్ల జరిమానా వడ్డించింది. ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీ తన డీజిల్‌ కార్లలో చీట్‌ డివైస్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించిందని ఎన్‌జీటీ పేర్కొంది. పర్యావరణ పరీక్షలను తప్పుదోవ పట్టించే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్‌ తన కార్లలో వినియోగించిందని, ఈ కార్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలంటూ ఐలావాడి అనే స్కూల్‌ టీచర్‌, మరికొందరు ఫిర్యాదు చేశారు. 
రెండు నెలల్లో జరిమానా డిపాజిట్‌ చేయండి 
రూ.500 కోట్ల జరిమానాను రెండు నెలల్లో డిపాజిట్‌ చేయాలని జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ అధ్యక్షతన గల ఎన్‌జీటీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌తో పాటు అధికంగా కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో  గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఖర్చు చేయాలని ఎన్‌జీటీ పేర్కొంది. కాగా తాము బీఎస్‌ ఫోర్‌ నిబంధనలను ఉల్లంఘించలేదని ఫోక్స్‌వ్యాగన్‌ పేర్కొంది. రహదారి పరీక్షలు ఆధారంగా తనిఖీలు జరిపారని, ఈ రహదారి పరీక్షలకు నిర్దేశిత ప్రమాణాలు లేవని వివరించింది.



You may be interested

2018-19లో 11 శాతం పడిపోనున్న పత్తి ఉత్పత్తి

Friday 8th March 2019

- 328 లక్షల బేళ్లగానే ఉండొచ్చని అంచనా - వర్షాభావ పరిస్థితులే కారణం - దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గుతాయి - కాటన్‌ అసోసియేషన్‌ అంచనాలు ముంబై: దేశంలో పత్తి (కాటన్‌) ఉత్పత్తి 2018-19 సీజన్‌లో 11 శాతం తగ్గిపోయి 328 లక్షల బేళ్లకు (ఒక్కో బేల్‌ 170 కిలోలు) పరిమితం కావచ్చని కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఏఐ) గురువారం అంచనా వేసింది. పత్తి సాగు చేసే కీలక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే దీనికి

వేతనాల్లో మహిళలకు అన్యాయమే

Friday 8th March 2019

- పురుషులతో పోలిస్తే 19 శాతం తక్కువ - మాన్‌స్టర్ శాలరీ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పటికీ.. వేతనాల విషయం వచ్చేసరికి మాత్రం పురుషుల ఆధిక్యతే కొనసాగుతోంది. భారత్‌లో పురుషుల, మహిళల వేతనాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంటోంది. పురుషులతో పోలిస్తే మహిళల వేతనాలు 19 శాతం తక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పురుషులు, మహిళల వేతనాల వ్యత్యాసాలకు

Most from this category