STOCKS

News


మహిళల సేఫ్టీ కోసం వొడాఫోన్‌ సఖి

Thursday 11th October 2018
news_main1539231484.png-21029

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ‘వొడాఫోన్‌ సఖి’ పేరుతో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని మొబైల్‌ ఆధారిత సేఫ్టీ సర్వీసులను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు చేతుల మీదుగా సఖిని ఆవిష్కరించారు. ఫోన్లో బ్యాలెన్స్‌, ఇంటర్నెట్‌ లేకున్నా ఈ ఉచిత సేవలు పనిచేయడం విశేషం. సఖి సర్వీసులకై 1800123100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. అత్యవసర సమయంలో కస్టమర్‌ ఉన్న ప్రాంతం (లొకేషన్‌) వివరాలు ముందుగా నమోదు చేసుకున్న 10 కాంటాక్ట్‌ నంబర్లకు వెళ్తుంది. మొబైల్‌లో బ్యాలెన్స్‌ లేనప్పటికీ 10 నిముషాలపాటు కాల్స్‌ చేసుకోవచ్చు. రిటైల్‌ ఔట్‌లెట్‌ వద్ద నంబర్‌ గోప్యత కోసం 10 అంకెల డమ్మీ నంబరును కస్టమర్‌కు కేటాయిస్తారు. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్‌ ఫోన్లలోనూ ఇది పనిచేస్తుంది.



You may be interested

టాటా 'టిగోర్‌' విడుదల

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: కాంపాక్ట్‌ సెడాన్‌ కారు టిగోర్‌ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్‌ మంగళవారం విడుదల చేసింది. పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.5.20లక్షలు–6.65 లక్షలు కాగా, ఇందులో 1.2 లీటర్ల ఇంజిన్‌ అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది. డీజిల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు–7.38 లక్షలుగా నిర్ణయించామని, 1.05 లీటర్ల ఇంజిన్‌తో ఈ సెడాన్‌ అందుబాటులో ఉంటుందని టాటా మోటార్స్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుంటెర్‌ బుషెక్‌ వెల్లడించారు. ఈ

సిండికేట్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ పెంపు

Thursday 11th October 2018

న్యూఢిల్లీ: మూడు నెలల కాలపరిమితికి సంబంధించి ఎంసీఎల్‌ఆర్‌ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు)ను సిండికేట్ బ్యాంక్‌ స్వల్పంగా 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది.  దీనితో మూడు నెలల కాలపరిమితి రుణాలపై వడ్డీరేట్ల 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. అక్టోబర్‌ 10వ తేదీ నుంచీ తాజా రేటు అమల్లో‍కి వస్తుంది. కాగా ఓవరనైట్‌ (8.30), నెల (8.35), ఆరు

Most from this category