STOCKS

News


వొడాఫోన్ ఐడియా నష్టం రూ. 4,882 కోట్లు

Tuesday 14th May 2019
news_main1557814618.png-25726

న్యూఢిల్లీ: దేశీ టెలికం మార్కెట్లో టారిఫ్‌ల పరంగా తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,882 కోట్ల నష్టం ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే మూడో క్వార్టర్‌లో నమోదైన రూ.5,005 కోట్లతో పోలిస్తే మాత్రం కొంత తగ్గింది. వొడాఫోన్‌, ఐడియా సంస్థలు గతేడాది ఆగస్టులో విలీనం కావడంతో అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో ఫలితాలను పోల్చి చూడటానికి లేదు. 2018-19 మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 11,765 కోట్లు కాగా, నాలుగో త్రైమాసికంలో దాదాపు అదే స్థాయిలో రూ.11,775 కోట్లుగా నమోదైంది. విలీనానంతరం అమలు చేస్తున్న నిర్ణయాలు క్రమంగా సానుకూల ఫలితాలిస్తున్నాయని, రెండేళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 37,092 కోట్లు కాగా, నష్టం రూ. 14,604 కోట్లు. ఒక్కో యూజరుపై సగటు ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే 16.3 శాతం పెరిగి రూ.104కి చేరింది. క్యూ3లో ఇది రూ.89గా ఉంది. సంస్థ ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి.



You may be interested

ఈడీ ముందుకు చందా కొచర్‌

Tuesday 14th May 2019

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలోనే వారు  రావాల్సి ఉన్నా కొంత గడువు కోరడంతో ఈడీ అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌ను కొద్ది రోజుల క్రితమే ఈడీ విచారణ చేసింది. సీబీఐ కూడా

6 నెలల గరిష్టం అయినా... అదుపులోనే!

Tuesday 14th May 2019

 ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.92 శాతం ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యం 4 శాతం  ఇదే తీరు కొనసాగితే మరోదఫా రేటు కోత న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం ఏప్రిల్‌లో 2.92 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 ఏప్రిల్‌లో సూచీలోని వస్తువుల బాస్కెట్‌ ధర 2019 ఏప్రిల్‌లో 2.92 శాతం పెరిగిందన్నమాట. ఈ స్థాయిలో రిటైల్‌ ధరల స్పీడ్‌ నమోదుకావడం ఆరు నెలల్లో ఇదే తొలిసారి. అయితే ఇది రిజర్వ్‌

Most from this category