STOCKS

News


వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ధర రూ.12.50

Thursday 21st March 2019
news_main1553161831.png-24730

-బుధవారం ముగింపు ధర కంటే 62 శాతం తక్కువ 
-రైట్స్‌ ఇష్యూ రికార్డ్‌ డేట్‌ ఏప్రిల్‌ 2
-ఏప్రిల్‌ 10-24 మధ్య రైట్స్‌ ఇష్యూ 
-ప్రతి 38 షేర్లకు 87 రైట్స్‌ షేర్లు 

న్యూఢిల్లీ:- వొడాఫోన్‌ ఐడియా కంపెనీ రైట్స్‌ ఇష్యూ ధరను నిర్ణయించింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదిత రైట్స్‌ ఇష్యూలో ఒక్కో ఈక్విటీ షేర్‌ (రూ.10 ముఖ విలువ) ధరను రూ.12.50కు జారీ చేయడానికి  కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. బుధవారం వొడాఫోన్‌ ఐడియా ముగింపు ధర(రూ.33)కు ఇది దాదాపు 62 శాతం తక్కువ. 

రికార్డ్‌ డేట్‌ వచ్చే నెల 2 
రైట్స్‌ ఇష్యూకు రికార్డ్‌  డేట్‌గా వచ్చే నెల 2ను నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌ 2వ తేదీలోపు ఎవరి దగ్గరైతే వొడాఫోన్‌ ఐడియా షేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ రైట్స్‌ ఇష్యూలో షేర్లు పొందడానికి అర్హత ఉంటుంది.  ప్రతి 38 ఈక్విటీ షేర్లకు కొత్తగా 87 రైట్స్‌ షేర్లను జారీ చేస్తారు. రైట్స్‌ ఇష్యూ ఏప్రిల్‌ 10న మొదలై 24న ముగుస్తుంది. ఈ రైట్స్‌ ఇష్యూలో ప్రమోటర్‌ సంస్థలు-వొడాఫోన్‌ గ్రూప్‌ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌రూ.7,250 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. ఈ రైట్స్‌ ఇష్యూ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ కాకపోతే, మిగిలిన భాగాన్ని భర్తీ చేయడానికి ఈ ప్రమోటర్‌ సంస్థలు అంగీకరించాయి. రైట్స్‌ ఇష్యూలో భాగంగా  ఈ కంపెనీ 2,000 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. రైట్స్‌ ఇష్యూ వల్ల సమకూరే నిధులతో ఆర్థికంగా మరింతగా పుంజుకొని రిలయన్స్‌ జియోకు వొడాఫోన్‌ ఐడియా గట్టిపోటీనివ్వగలదని నిపుణుల అంచనా. ఐడియా రుణ భారం రూ.1,23,660 కోట్లుగా ఉంది. ఈ రుణ భారం తగ్గించుకోవడానికి రైట్స్‌ ఇష్యూ నిధులను వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. వొడాఫోన్‌ ఐడియాలో బ్రిటిష్‌  టెలికాం దిగ్గజం వొడాఫోన్‌కు 45.1 శాతం, కుమార మంగళం  బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం, వాటాదారులకు 28.9 శాతం చొప్పున వాటాలున్నాయి. 



You may be interested

డిస్నీ చేతికి ఫాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారం

Thursday 21st March 2019

డీల్‌ విలువ 7,100 కోట్ల డాలర్లు లాస్‌ఏంజెల్స్‌: ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ ఫాక్స్‌ కంపెనీ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారాన్ని డిస్నీ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ డీల్‌ విలువ 7,100 కోట్ల డాలర్లు మేర ఉంటుంది. ఈ డీల్‌లో భాగంగా ఫాక్స్‌ సంస్థకు చెందిన ఫిల్మ్‌, టీవీ స్టూడియో, ఎఫ్‌ఎక్స్‌, నేషనల్‌ జాగ్రఫిక్‌, హులు స్ట్రీమింగ్‌ సర్వీస్‌లో ఫాక్స్‌కు ఉన్న 30 శాతం వాటా, స్టార్‌ ఇండియాలపై హక్కులు డిస్నీకి లభిస్తాయి. ఈ కంపెనీ

నీరవ్‌ 173 పెయింటింగ్స్‌, 11 వాహనాలు వేలం!

Thursday 21st March 2019

న్యూఢిల్లీ: కోట్లాదిరూపాయల మేర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసి, దేశం నుంచి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారికి చెందిన 173 విలువైన పెయింటింగ్స్‌, 11 వాహనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ(ఈడీ)లు వేలం వేయనున్నాయి. నీరవ్‌ మోదీ, ఆయన షెల్‌ కంపెనీ-క్యాపెలాట్‌ పెయింటింగ్స్‌కు బెనిఫీషిల్‌ యజమానులు. ముంబైలోని ప్రత్యేక కోర్టు పెయింటింగ్స్‌, వాహనాల వేలానికి అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపారు. వేలం వేయనున్న పెయింటింగ్స్‌

Most from this category