STOCKS

News


ఐడియా నష్టాలు రూ.4,973 కోట్లు

Thursday 15th November 2018
news_main1542259450.png-22040

న్యూఢిల్లీ: వోడాఫోన్‌ ఐడియా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,973 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేడెట్‌) వచ్చాయి. 42.2 కోట్ల మంది వినియోగదారులతో భారత్‌లో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించిన ఈ కంపెనీ  రూ.7,663 కోట్ల ఆదాయాన్ని (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి స్థూల రుణభారం రూ.1,26,100 కోట్లుగా ఉందని వోడాఫోన్‌ ఐడియా తెలిపింది. రూ.13,600 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయని, నికర రుణభారం రూ.1,12,500 కోట్లని  కంపెనీ సీఈఓ బాలేశ్‌ శర్మ చెప్పారు. ఎబిటా రూ.980 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. 

ఏఆర్‌పీయూ... అంచనాలు మిస్‌ 
టెలికం ప్లాన్‌ల విషయంలో ధరల పోరు ప్రభావం కొనసాగుతోందని, వినియోగదారులు చౌక-ధరల ప్లాన్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని బాలేశ్‌ శర్మ పేర్కొన్నారు.  ఫలితంగా ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) ఈ క్యూ2లో 4.7 శాతం తగ్గి రూ.88కు పడిపోయిందని (సీక్వెన్షియల్‌గా) వివరించారు.  విశ్లేషకులు ఈ కంపెనీ ఏఆర్‌పీయూ రూ.95-96 రేంజ్‌లో ఉండగలదని అంచనా వేశారు. ఈ క్యూ1లో ఈ కంపెనీ ఏఆర్‌పీయూ రూ. 100 గా ఉంది. 

రూ.25,000 కోట్లు సమీకరణ ! 
కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ రూ.25,000 కోట్ల మూలధన నిధుల సమీకరణ కోసం కసరత్తు చేస్తోందని బాలేశ్‌ శర్మ తెలిపారు.  ప్రమోటర్‌ సంస్థలు-వోడాఫోన్‌ గ్రూప్‌ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.7,250 కోట్లు చొప్పున మొత్తం రూ.18,250 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని వివరించారు. ఫైబర్‌ నెట్‌వర్క్‌ విభాగాన్ని విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 

తొలి ఫలితాలు...
ఐడియా కంపెనీలో వోడాఫోన్‌ విలీనం ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తయింది. ఈ విలీనం తర్వాత ఏర్పడిన  వోడాఫోన్‌ ఐడియా కంపెనీ వెలువరించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఈ ఆర్థిక ఫలితాల్లో ఈ ఏడాది జూలై-ఆగస్టు  వరకూ ఐడియా సెల్యులర్‌ ఫలితాలు, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 30 వరకూ ఓడాఫోన్‌ ఐడియా ఫలితాలు కలగలసి ఉన్నాయని, అందుకని గత క్యూ2లో ఐడియా సెల్యులర్‌ ఫలితాలతో ఈ క్యూ2 ఓడాఫోన్‌ ఐడియా ఫలితాలను పోల్చడానికి లేదని బాలేశ్‌ శర్మ వివరించారు. విలీన ప్రయోజనాలు అందుకునే దిశగా పయనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. 


 



You may be interested

యస్‌ బ్యాంక్ చైర్మన్‌ అశోక్ చావ్లా రాజీనామా

Thursday 15th November 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్‌ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్‌ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్ వసంత్ గుజరాతి కూడా రాజీనామా చేసినట్లు యస్‌ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అయిదేళ్ల పాటు అదనపు డైరెక్టర్‌ (స్వతంత్ర)గా ఉత్తమ్‌ ప్రకాశ్ అగర్వాల్‌ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు యస్‌ బ్యాంక్ తెలిపింది. బ్యాంకు

9 రెట్లు పెరిగిన ఓవీఎల్‌ లాభం

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: అధిక చమురు ధరల సానుకూలతతో ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ (ఓవీఎల్‌) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మంచి పనితీరు ప్రదర్శించింది. కంపెనీ లాభం ఏకంగా 878 శాతం వృద్ధితో రూ.1,384 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.142 కోట్లు కాగా, 2017-18 పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ మొత్తం లాభం రూ.981 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభానికి మించి

Most from this category