STOCKS

News


వొడాఫోన్‌ ఐడియాకు రూ.20,000 కోట్లు !

Monday 18th February 2019
Markets_main1550472202.png-24240

-టవర్ల వాటా, ఆప్టిక్‌ ఫైబర్‌ విక్రయం ద్వారా 

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియా కంపెనీ మొబైల్‌ టవర్‌ సంస్థ, ఇండస్‌ టవర్‌లో వాటా విక్రయించాలని యోచిస్తోంది. ఈ వాటా విక్రయంతో పాటు ఆప్టికల్‌ ఫైబర్‌ ఆస్తులను కూడా విక్రయించనున్నది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.  విక్రయాల్లో భాగంగా ఇండస్‌ టవర్స్‌లో 11.15 శాతం వాటాను, అలాగే 1.56 లక్షల కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విక్రయించనున్నారు. ఈ విక్రయాల కారణంగా రూ.20,000 కోట్లు సమీకరించాలనేది ఈ కంపెనీ ఆలోచన. ఈ నిధులను భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. గత ఏడాది చివరి నాటికి కంపెనీ రుణభారం రూ.1,23,660 కోట్లుగా ఉంది. 


రూ.25,000 కోట్ల రైట్స్‌ ఇష్యూ...
కాగా మూలధన పెట్టుబడులు, రుణభారం తగ్గించుకోవడానికి గాను రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని కూడా వొడాఫోన్‌ ఐడియా ​‍ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైట్స్‌ ఇష్యూలో భాగంగా వొడాఫోన్‌ గ్రూప్‌ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.7,250 కోట్లు పెట్టుబడులు పెడతాయి. మిగిలిన మొత్తానికి తగిన సబ్‌స్క్రిప్షన్‌ రాకపోతే, ఆ మొత్తాన్ని కూడా ఈ రెండు కంపెనీలే సర్దుబాటు చేయాలనుకుంటున్నాయి.



You may be interested

తక్షణ మద్దతు శ్రేణి 35,510-35,375

Monday 18th February 2019

కొద్దినెలలుగా ప్రపంచ ట్రెండ్‌కు భిన్నంగా దేశీయ సూచీలు కదులుతూ వస్తున్నాయి. ఇదేరీతిలో గతవారం ప్రపంచ మార్కెట్లన్నీ కొద్దిపాటి హెచ్చుతగ్గులతో నెలల గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతుండగా, భారత్‌ మార్కెట్‌ మాత్రం రెండు శాతంపైగా క్షీణించింది.  మరిన్ని కార్పొరేట్‌ గ్రూప్‌లు రుణాల చెల్లింపులో డిఫాల్ట్‌అయ్యే సంకేతాలు, మరో రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణం కావొచ్చు. మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించే హెవీవెయిట్‌ షేర్లలో ఇన్ఫోసిస్‌ మినహా మిగిలినవన్నీ

జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.3,000 కోట్లు

Monday 18th February 2019

సగానికి తగ్గనున్న నరేశ్‌ గోయల్‌ వాటా !  న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.3,000 కోట్ట పెట్టుబడులు అందనున్నాయి. రుణ పునర్వ్యస్థీకరణ అనంతరం ఎతిహాద్‌, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌) ఈ పెట్టుబడులు అందించనున్నాయని సమాచారం. దీంతో ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ వాటా ప్రస్తుతమున్న 51 శాతం నుంచి 20 శాతానికి  తగ్గనున్నది.  ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌లో అబుదాబికి చెందిన ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉంది.ఈ కంపెనీ రూ.1,400

Most from this category