STOCKS

News


భారత్‌లో ‘వీఎంవేర్‌’ భారీ పెట్టుబడులు

Thursday 18th October 2018
news_main1539833997.png-21254

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ వీఎంవేర్‌ భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్లు (రూ.14,679 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు, పూణే ప్రాంతాలలోని కార్యాలయాల విస్తరణకు ఈ నిధులను వినియోగించనుండగా, ఇదే సమయంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు సంస్థ సీఈఓ పాట్ జెల్సింగర్ అన్నారు. ‘భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులను పెంచడం ద్వారా అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధికి ఇక్కడివారి ఇంజినీరింగ్‌ ప్రతిభ తోడ్పతుంది. తద్వారా మొత్తం ఉత్పత్తి పోర్టిఫోలియోకు ప్రయోజనం చేకూరుతుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు. 



You may be interested

ఆర్థిక వృద్ధికి 'ఫ్లెక్సిబుల్' వర్కింగ్ ఊతం

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: సరళతర పని విధానాలు (ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌) దేశ ఆర్థిక వృద్ధికి ఊతమివ్వనున్నాయి. కార్పొరేట్లు వ్యయాలు తగ్గించుకోవడానికి, ఉద్యోగుల ఉత్పాదకత మెరుగుపడటానికి ఇవి దోహదపడనున్న నేపథ్యంలో 2030 నాటికల్లా ఈ విధానాలతో ఎకానమీకి ఏటా 376 బిలియన్ డాలర్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. అంతర్జాతీయ వర్క్‌స్పేస్ సంస్థ రీగస్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా తదితర 16 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం

రాణా కపూర్‌కు ఆర్‌బీఐ నో

Thursday 18th October 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ నిరాకరించింది. కొత్త చీఫ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా నియమించాలని బ్యాంకు బోర్డును ఆదేశించింది. స్టాక్ ఎక్స్చేంజీలకు యస్‌ బ్యాంక్ బుధవారం ఈ విషయాలు తెలియజేసింది. "యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రాణా కపూర్ వారసుణ్ని 2019 ఫిబ్రవరి 1లోగా ఎంపిక చేయాలని రిజర్వ్ బ్యాంక్ పునరుద్ఘాటించింది" అని వివరించింది.

Most from this category