STOCKS

News


విదేశీ రూట్లలో విస్తార సర్వీసులు

Thursday 30th August 2018
news_main1535606450.png-19788

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తార అక్టోబర్‌ నుంచి విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ముందుగా న్యూఢిల్లీ నుంచి కొలంబో (శ్రీలంక), ఫుకెట్‌ (థాయ్‌ల్యాండ్‌) ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన అనుమతులు పొందడం, అంతర్జాతీయ కార్యకలాపాల ప్రణాళికలు ఖరారు చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టినట్లు వివరించాయి. అన్నింటికన్నా ముందుగా దుబాయ్‌కు సర్వీసులు ప్రారంభించాలనుకున్నప్పటికీ .. ఇప్పటికే రెండు దేశాల ద్వైపాక్షిక కోటా పూర్తి అయిపోవడంతో సాధ్యపడటం లేదని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.  ఇటీవల జూన్‌లో 21వ విమానం అందుకోవడంతో విదేశాలకు ఫ్లయిట్ సర్వీసులు నడిపేందుకు విస్తారకు అర్హత లభించింది. త్వరలోనే 22వ విమానం కూడా డెలివర్ కానున్నట్లు సంస్థ సీఈవో లెస్లీ థింగ్‌ పేర్కొన్నారు. మొత్తం మీద 50 దాకా ఏ320 నియో విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. అటు మరో విమానయాన సంస్థ గోఎయిర్‌ కూడా అక్టోబర్‌ నుంచే విదేశీ రూట్లలో విమాన సేవలు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ (సియా) జాయింట్‌ వెంచర్‌గా 2015 జనవరి 9న వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన విస్తార.. ఇప్పటిదాకా 90 లక్షల పైచిలుకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. 22 ప్రాంతాలకు వారానికి 800 పైగా ఫ్లయిట్స్ నడుపుతోంది. 



You may be interested

అదానీ చేతికి రిలయన్స్‌ ఎనర్జీ

Thursday 30th August 2018

ముంబై: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ముంబైలోని విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని విక్రయించటం పూర్తయింది. ముంబై నగర విద్యుత్‌ సరఫరా వ్యాపారాన్ని (రిలయన్స్‌ ఎనర్జీ కపెనీని) రూ.18,800 కోట్లకు అదానీ ట్రాన్సిమిషన్‌కు విక్రయించడం పూర్తయిందని కంపెనీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ తెలియజేశారు. ఈ విక్రయంతో మూడింట రెండొంతుల రుణ భారం తగ్గిందన్నారు. ఇంతకు ముందు రూ.22,000 కోట్లుగా ఉన్న కంపెనీ రుణ భారం ఇప్పుడు రూ.7,500 కోట్లకు తగ్గిందని

25 ​‍ప్రాజెక్ట్‌లను అమ్మేస్తాం

Thursday 30th August 2018

ముంబై: మౌలిక రంగ కంపెనీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ త్వరలో రైట్స్‌ ఇష్యూకి రాబోతోంది. అలాగే  ఆస్తులను విక్రయించి రూ.30,000 కోట్ల మేర రుణ భారం తగ్గించుకోవాలని కూడా యోచిస్తోంది.  ఈ రెండు ప్రతిపాదనలకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపినట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. ఒక్కో షేర్‌ రూ.150 చొప్పున 30 కోట్ల ఈక్విటీ షేర్లను రైట్స్‌ ఇష్యూ ద్వారా జారీ చేసి రూ.4,500 కోట్లు సమీకరిస్తామని తెలిపింది. ఈ రైట్స్‌ ఇష్యూ

Most from this category