STOCKS

News


'విస్తార' భారీ విస్తరణ!

Wednesday 11th July 2018
news_main1531327128.png-18213

న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానయాన సంస్థ 'విస్తార'... దేశీ, విదేశీ రూట్లలో కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 19 ఎయిర్‌బస్‌, బోయింగ్ విమానాలకు ఆర్డరు ఇవ్వనుంది. వీటి విలువ 3.1 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 21,344 కోట్లు) ఉండనుంది. అలాగే ఏ320 నియో రకానికి చెందిన మరో 37 విమానాలను లీజుకు తీసుకోనుంది. విస్తార బుధవారం ఒక ప్రకటనలో ఈ మేరకు విస్తరణ ప్రణాళికలను వివరించింది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ జాయింట్ వెంచర్ అయిన విస్తార.. కార్యకలాపాలు ప్రారంభించించి మూడేళ్లు దాటింది. ప్రస్తుతం కంపెనీకి ఏ-320 రకం విమానాలు 21 ఉన్నాయి. 22 ప్రాంతాలకు వారానికి 800 పైచిలుకు ఫ్లయిట్స్‌ నడుపుతోంది. ఈ ఏడాది విదేశీ రూట్లలో కూడా సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది. 
రెండు సంస్థలతో ఒప్పందాలు..
కార్యకలాపాల విస్తరణ నేపథ్యంలోనే కొత్తగా ఎయిర్‌బస్ సంస్థ నుంచి ఏ320 నియో రకానికి చెందిన 13 విమానాలు, బోయింగ్ నుంచి 6 డ్రీమ్‌లైనర్స్‌ను (787-9 ఎయిర్‌క్రాఫ్ట్‌) కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు విస్తార పేర్కొంది. ఎయిర్‌బస్‌తో ఒప్పందం ప్రకారం విస్తార ముందుగా ఏ320, ఏ321 రకానికి చెందిన 13 విమానాలను కొనుగోలు చేయనుంది. సందర్భాన్ని బట్టి మరో ఏడు ఏ320 రకం విమానాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే లీజింగ్ కంపెనీల నుంచి మరో 37 కొత్త ఏ320 నియో విమానాలను కూడా విస్తార లీజుకు తీసుకోనుంది. నియో విమానాలు 2019- 2023 మధ్య డెలివరీ అయ్యే అవకాశముంది. ఈ విమానాలను దేశీ రూట్లలోనూ, సందర్భాన్ని బట్టి అంతర్జాతీయ రూట్లలోనూ ఉపయోగించనున్నారు. ఇక, బోయింగ్‌తో ఒప్పందం ప్రకారం విస్తార 787-7 డ్రీమ్‌లైనర్ విమానాలు ఆరు కొనుగోలు చేయనుంది. 787 డ్రీమ్‌లైనర్ కోవకి చెందిన మరో నాలుగింటిని కూడా కొనుగోలు చేసే వెసులుబాటు  ఉంటుంది. సుదీర్ఘ అంతర్జాతీయ రూట్ల కోసం 787-9 డ్రీమ్‌లైనర్స్‌ను ఉపయోగించనున్నట్లు విస్తార సీఈవో లెస్లీ తెలిపారు. కొత్త విమానాల కొనుగోళ్లకు అవసరమైన నిధులను ప్రస్తుత వాటాదారులు టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమకూర్చనున్నట్లు వివరించారు. ఎయిర్‌బస్ ఏ320 నియోలో 194 సీట్లు, ఏ321 నియోలో 244 సీట్లు... బోయింగ్ 787-9 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లో 290 దాకా సీట్లుంటాయి.



You may be interested

జీఎంఆర్‌కు దక్కని ఫిలిపిన్స్‌ విమానాశ్రయ నిర్వహణ

Wednesday 11th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిలిప్పిన్స్‌లోని క్లార్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలు జీఎంఆర్‌ గ్రూప్‌కు దక్కలేదు. కాంట్రాక్ట్‌ నిర్వహణ బాధ్యతల కోసం జీఎంఆర్‌ గ్రూప్‌ వేసిన బిడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ అందించే స్కైట్రాక్‌ రేటింగ్‌లో క్వాలిఫై కాకపోవటమే ఇందుకు కారణమని తెలియవచ్చింది. కానీ, జీఎంఆర్‌ దాని ఫిలిప్పిన్స్‌ పార్ట్‌నర్‌ మెగావైడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ క్లార్‌ విమానాశ్రయ ఈపీసీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికైతే క్లార్క్‌

పీఎన్‌బీ హౌసింగ్‌లో వాటా విక్రయిస్తాం

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలియజేసింది. కార్లైల్‌ గ్రూప్‌తో కలిసి కనీసం 51 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో పీఎన్‌బీకి 32.79 శాతం వాటా, కార్లైల్‌ గ్రూప్‌కు చెందిన క్వాలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు 32.36 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 4.8 శాతం వాటాను ఈ ఏడాది మేలో క్వాలిటీ

Most from this category